టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి

Wed,April 24, 2019 03:04 AM

రఘునాథపల్లి ఏప్రిల్ 23 : మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రఘునాథపల్లి వైశ్యభవనంలో మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, అధ్యక్షుడు, సర్పంచ్ పోకల శివకుమార్ అధ్యక్షత వహించగా ఎన్నిక ఇన్‌చార్జి వాసుదేవరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని కాంగ్రెస్, టీడీపీలను చిత్తు చేయాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను పార్టీ గుర్తిస్తుందని పార్టీ కోసం కష్టపడి పార్టీకి విధేయులుగా ఉన్నావారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు పూర్తి మెజార్టీ అందించి గెలిపించిన ని యోజక వర్గం ప్రజలకు నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి పలు రా ష్ర్టాలు హర్షిస్తున్నాయని రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరొందుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధ్దిలో నాలుగో స్థానంలో ఉందని అధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు. ఎన్నికల్లో పార్టీకి నింబంధనలకు విరుద్ధ్దంగా పనిచేసిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీ సుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో వివిధ గ్రామాల నుంచి 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 62, ఒక జెడ్పీటీసీ స్థానాలకు గాను 9 మంది దరఖాస్తులు చేసుకున్నారు. జెడ్పీటీసీ టికెట్ ఆశావహులు గూడ సునీత, బిర్రు మధు, కందుకూరి ప్రభాకర్, మంద రమేశ్, మేకల నరేందర్, డేవిడ్‌రాజ్, ఎస్కే రాజు, బొల్లం అజయ్, చింత స్వామి ఉన్నారని తెలిపారు.
సమావేశంలో జెడ్పీటీసీ బానోత్ శారద, రైతు సమన్వయ జిల్లా సభ్యుడు మారుజోడు రాంబాబు, ఎన్నికల మండల ఇన్‌చార్జి రవీందర్‌రావు, మాజీ ఎంపీపీ వై కుమార్‌గౌడ్, రైతు సమన్వయసమితి మండల కోఆర్డ్డినేటర్ గొరిగె రవి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, నాయకులు ఎండీ భాషుమియా, గూడ సునీత, బిర్రు మధు, కుర్ర కమలాకర్, కొర్ర రాజేందర్, లోనే శ్రవణ్, గూడ కిరణ్‌కుమార్, బొల్లం పద్మ, ఆకుల మహేశ్, అన్వేష్, కోళ్ల కిరణ్, మాల్యానాయక్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధ్యక్ష కార్యదర్శులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles