ప్రాదేశికంలో సత్తా చాటుదాం

Tue,April 23, 2019 02:28 AM

- కలిసికట్టుగా పనిచేసి విజయబావుటా ఎగురవేద్దాం
- సమన్వయంతో ముందుకు వెళ్తే విజయం తథ్యం
- సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు కొండంత బలం
- జిల్లా ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- చిలుపూరులో కార్యకర్తలతో సన్నాహక సమావేశం
- హాజరైన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తేతెలంగాణ, ఏప్రిల్ 22: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పని చేసి నియోజకవర్గంలో అన్ని స్థానాలను కైవసం చేసుకొని సత్తా చాటాలని ఎమ్మెల్సీ, ప్రాదేశిక ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. చిలుపూరులోని శేషాద్రి భవనంలో సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు పోలెపల్లి రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పథకాలకే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. విభేదాలు ఉంటే పక్కనబెట్టాలని హితవు పలికారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే మరోమారు గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ, రైతుబంధు, బీమా, పేదల కోసం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు తదితర పథకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను కొందరు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్ సర్కార్ రైతు సమస్యలను పూర్తి తొలగించనుందన్నారు.

ఐక్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే
అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ ఎన్నికల్లో పని చేసినట్లుగానే నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పని చేసి అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. పార్టీ నిబంధనలకనుగుణంగా నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో అత్యధిక చెరువులు ఉన్న ప్రాంతం చిలుపూరు మండలమన్నారు. అదేవిధంగా 169 చెరువులను నింపిన ఏకైక నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్ అని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.

సమావేశంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రాదేశిక ఎన్నికల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వాసుదేవారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఎంపీపీ వంగాల జగన్మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు ఎడవెల్లి విజయ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆకుల కుమార్, మారపాక రవి, మాలోత్ రమేశ్‌నాయక్, టీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జి పాగాల సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి బాలరాజు, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌నాయక్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు లింగారెడ్డి, సోమిరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీను, సర్పంచ్‌లు రాజ్‌కుమార్, కొంగర రవి, పుట్ట అంజనాదేవి రవీందర్‌రెడ్డి, ఏదునూరి రవీందర్, కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు చల్లారపు రాజేందర్, తాళ్లపెల్లి సమ్మయ్య, నీల రాజు, ఇసురం వెంకటయ్య, రత్నాకర్‌రెడ్డి, గుర్రపు వెంకటేశ్వర్లు, రంగు రమేశ్‌గౌడ్, నారగోని రాజు, జైపాల్, అశోక్ పాల్గొన్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన ఆశావహుల అభ్యంతరాలను పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యకు అందజేశారు.

56
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles