నాటక రంగానికి సీఎం కేసీఆర్ ప్రోత్సాహం

Tue,April 23, 2019 02:25 AM

న్యూశాయంపేట, ఏప్రిల్ 22: అంతరించిపోతున్న నాటక రంగానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక, చలన చిత్రాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వనం లక్ష్మీకాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు అని, సాహిత్యం, కళారంగాల్లో జాతీయ ఉద్యమంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించారని కొనియాడారు. అంతరించిపోతున్న నాటక రంగా న్ని బతికించి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. పందిళ్ల శేఖర్‌బాబు తన వృత్తిని సమర్థవంతగా నిర్వర్తిస్తూనే ప్రవృత్తిపరంగా నాటక రంగానికి సేవలు అందిం చారని వివరించారు. పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటక సప్తాహ కమిటీ సభ్యుడు పందిళ్ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాటక రంగాన్ని బతికించడానికి రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సంచాలకులు ఎంవీ రమణారావు నాటక సప్తాహం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారన్నారు.

వరంగల్ నుంచే సప్తాహ కార్యక్రమం ప్రారంభించారన్నారు. గత రెండేళ్ల నుంచి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. సభ నిర్వాహణ అనంతరం గురుమిత్ర రేపల్లె వారు రైతే రాజు సాంఘిక నాటకం, తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ వరంగల్ వారు శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ వరప్రసాద్ పురుషోత్తమరావు, ఆకుల సదానందం, నిమ్మల శ్రీనివాస్, దామోదర్, రామశాస్త్రి పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles