స్ట్రాంగ్‌రూంల భద్రతను పరిశీలించిన కలెక్టర్

Tue,April 23, 2019 02:25 AM

కాశీబుగ్గ, ఏప్రిల్ 22: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాంలు, స్ట్రాంగ్‌రూమ్‌లను లోకసభ రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అందులో భద్రపర్చిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను పరిశీలించారు. మే 23న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ వరకు మూడంచెల నిరంతర సెక్యూరిటీ కొనసాగుతుందని చెప్పారు. భద్రతకు ఏర్పాటు చేసిన సీసీ టీవీలు, సెక్యూరిటీ వ్యవస్థను తనిఖీలు చేశారు. ఈ నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles