ఠాణా దుమ్ముదులిపిన పోలీసులు..!

Mon,April 22, 2019 01:52 AM

జనగామ టౌన్, ఏప్రిల్ 21: రోడ్డు ప్రమాదాలు.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాలు.. ఇతర కారణాలతో తీసుకొచ్చిన బైక్‌లతో జనగామ పోలీస్‌స్టేషన్ మొత్తం నిండిపోయింది. అయితే, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఐ మల్లేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో జనగామ ఠాణాను ఆదివారం శుభ్రం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ క్యాంపస్ వార్షికోత్సవానికి రోడ్డుమార్గాన జనగామ మీదుగా 23న డీసీపీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో జనగామ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించే అవకాశాలు ఉన్నయని ఇంటెలీజెన్స్ వర్గాల సమాచారం మేరకు సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సైలు శ్రీనివాస్, రాజేశ్‌నాయక్, రవికుమార్ పోలీస్‌స్టేషన్‌లోని పరిసరాలను శుభ్రం చేయడంతోపాటు స్టేషన్‌లో ఫిర్యాదుల విభాగం ఫర్నిచర్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నో ఏళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు వివిధ సందర్భాల్లో పట్టుబడిన సుమారు 100 ద్విచక్ర వాహనాలు, చెత్తాచెదారాన్ని తొలగించడంతో పోలీస్‌స్టేషన్ పరిసరాలన్నీ పరిశుభ్రంగా మారాయి. అంతేకాకుండా స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు కూర్చునేందుకు అవకాశం ఏర్పడిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

66
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles