ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం

Mon,April 22, 2019 01:51 AM

-నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
-మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి
దేవరుప్పుల, ఏప్రిల్ 21: మండలవ్యాప్తంగా 12 ఎంపీటీసీలతోపాటు జెడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం మండల పరిషత్ కార్యాలయంలో మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒకటి చొప్పున 4 నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక జెడ్పీటీసీ స్థానానికి ప్రత్యేకంగా నామినేషన్ల స్వీకరణ సెంటర్‌ను మండల పరిషత్‌లోనే ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 22 నుంచి 24 వరకు నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న స్క్రూటినీ, 28న నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రదర్శన ఉంటుందని ఎన్నికల అధికారి, ఉద్యాన జిల్లా అధికారి కేఆర్ లత తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ఐదుగురు ఆర్వోలు, మరో ఐదుగురు ఏఆర్వోలను ఎన్నికల కమిషన్ నియమించింది.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles