నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

Mon,April 22, 2019 01:51 AM

లింగాలఘనపురం: మండలంలో వచ్చే నెల 6న జరిగే ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో సురేందర్ తెలిపారు. మండలకేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 64 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జెడ్పీటీసీ నామినేషన్ కోసం ఎంపీపీ చాంబర్‌లో సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అలాగే, ఎంపీడీవో కార్యాలయ సమావేశపు గది మొదటి డోర్‌లో క్లస్టర్‌వన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో చీటూరు, కుందారం, నెల్లుట్ల ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని వివరించారు. రెండో డోర్‌లో రెండో క్లస్టర్‌లో నేలపోగుల, వడిచర్ల, నవాబుపేట ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఈజీఎస్ స్టాఫ్‌రూంలో ఏర్పాటు చేసిన మూడో క్లస్టర్‌లో గుమ్మడవెల్లి, కళ్లెం, మాణిక్యపురం, ఈజీఎస్ కంప్యూటర్ గదిలో ఏర్పాటు చేసిన నాలుగో క్లస్టర్‌లో వనపర్తి, లింగాలఘనపురం మండలాలకు సింబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని వివరించారు. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని కోరారు. నాయకులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

55
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles