ఘనంగా ఈస్టర్ వేడుకలు

Mon,April 22, 2019 01:50 AM

-వేడుకల్లో పాల్గొన్న
-ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య దంపతులు
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : ఈస్టర్ వేడుకలను ఆదివారం ఆర్‌సీఎం చర్చి ఆవరణ నిర్మలామాత ప్రదేశంలో క్రైస్తవులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆయన సతీమణి ఫాతిమామేరీ పాల్గొన్నారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు శిలువపై మరణించిన రోజున గుడ్‌ఫ్రైడేగా మరణించిన మూడో రోజున సమాధి నుంచి తిరగి లేవడాన్ని(పునరుద్ధరణ) ఈస్టర్‌గా జరుపుకుంటామని ఆర్‌సీఎం చర్చి ఫాదర్లు ఎన్ సురేందర్, దాసయ్య వివరించారు. అనంతరం ప్రత్యేక వచనాలతో ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సీహెచ్ నరేందర్‌రెడ్డి, ఎస్ జగన్, పార్శి కమల్, ఆకుల కుమార్, రవి, తోట వెంకన్న, సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్, ఉపసర్పంచ్ నీల ఐలయ్య, ఎంపీటీసీలు ఎస్ దయాకర్, గోనెల ఉపేందర్, డాక్టర్ సత్యనారాయణరాజు, నాయకులు డాక్టర్ జగన్, డాక్టర్ కే కుమార్, పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, మత్స్య సంఘం చైర్మన్ మునిగెల వెంకన్న, చెరిపల్లి రామల్లు, గోనెల డబ్బరాజు, ఆర్‌సీఎం చర్చి సంఘ పెద్దలు ఎస్ నాగయ్య, మధు, చింత శ్రీను, కే రాజుకుమార్, ఎస్ రాజయ్య, ఎస్ చంద్రమౌళి, అశోక్‌రెడ్డి, ప్రమీళ, అనిత, సులోచన, ఎలీష, కుమార్, భరత్‌కుమార్, సింగపురం యాదగిరి, సింగపురం రవి, చింత ఎల్లయ్య, సింగపురం వెంకటయ్య, రాజారపు ప్రసాద్, డాక్టర్ చింత వెంకటస్వామి, ఉపదేశి వెంకటేశ్, సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles