పనిచేసే వారికే ప్రాదేశిక ఎన్నికల్లో ప్రాధాన్యం

Mon,April 22, 2019 01:49 AM

-పైరవీలు లేవు.. ప్రజాదరణ కావాలి
-జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
తరిగొప్పుల : గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం పనిచేసేవారికే త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో ప్రధాన్యత ఉంటుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం తరిగొప్పుల మండల కేంద్రంలోని జనగామ రోడ్డు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రామాల్లో స్వచ్ఛతెలంగాణలో పాల్గొంటూ గ్రామీణ ప్రజల అవసరాలు తీరుస్తూ, వారిసమస్యలు పరిష్కరించే స్థానికులకు ఎంపీటీసీగా, జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా, జెడ్పీచైర్‌పర్సన్లుగా పార్టీ నుంచి అదరణ ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పైరవీలు చేసేవారికి స్థానం ఉండదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుచున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా అమలుకావడంలేదని రైతు బంధు, రైతుబీమాలాంటి పథకాలను దేశంలోని ఇతర రాషాల్లో కాపీ కొడుతున్నారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ సైతం రైతుబంధును కాపీ కొట్టి దేశమంతటా ఐదు ఎకరాలలోపు భూములు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.ఆరు వేల పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఊరుచెరువు గోదావరి నీళ్లతో కళకళాలాడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దీనికి తెలంగాణ ప్రజలు తెలంగాణాలోని అన్ని స్థానాలు టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలింపించి కానుకగా అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా నాయకుడు బీరెడ్డి జార్జిరెడ్డి, అర్జుల సుధాకర్‌రెడ్డి, రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్ భూక్య జూమిలాల్‌నాయక్, నాయకులు చిలువేరు లింగం, కుర్రె మల్లయ్య, సర్పంచ్ దామెర ప్రభుదాస్, మాజీ సర్పంచ్ మహిపాల్, సాయిల్ల రాజు, చెన్నూరి సంజీవ, రవి, భూక్య రవి, కనకయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles