మోగిన నగారా..!

Sun,April 21, 2019 01:55 AM

- జిల్లాలో మూడు విడతల్లో ప్రాదేశిక పోరు
- మే 6, 10, 14వ తేదీల్లో ఎన్నికలు
= 27న తుది ఫలితాల వెల్లడి

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాదేశిక ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మూడు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎన్నికల తేదీలను ప్రకటించారు. మొదటి విడత మే 6న, రెండో విడత 10న, మూడో విడత ఎన్నికలను 14వ తేదీన నిర్వహిస్తామన్నారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు ఉదయం 10.30 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు పరిశీలించి.. అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 26న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లపై అప్పీల్ చేసేందుకు గడువు విధించారు. 27న అప్పీల్ పరిశీలిస్తారు. 28న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికల నిర్వహణకు 26న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదేరోజు ఉదయం 10.30 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

29న 5 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితా ప్రకటిస్తారు. 30న 5 గంటల వరకు నామినేషన్లకు సంబంధించి అప్పీళ్లు స్వీకరించి మే 1న పరిశీలిస్తారు. 2న 3 గంటల వరకు నామినేషన్ల విత్‌డ్రా అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మూడో విడత ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల చేసి అదేరోజు ఉదయం 10.30 గంటల నుంచి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. నాలుగో తేదీ 5 గంటల వరకు అప్పీళ్లు స్వీకరించి 5న నామినేషన్లు పరిశీలిస్తారు. 6న 3 గంటల వరకు నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గడువు విధించారు. అదేరోజు 3 గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు.

12 జెడ్పీటీసీలు, 140 ఎంపీటీసీలు
జిల్లాలో 12 జెడ్పీటీసీలు, 140 ఎంపీటీసీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తొలి విడత మే 6న దేవరుప్పుల, లింగాలఘణపురం, పాలకుర్తి, కొడకొండ్ల మండలాల జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 112 ప్రాంతాల్లో 299 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొదటి విడత నాలుగు మండలాలకు సంబంధించి 1,38,837 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత మే 10న జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల జెడ్పీటీసీ, 37 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు 79 ప్రాంతాల్లో 218 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండో విడత 1,01,359 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మూడో విడత మే 14న స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు, జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండలాల జెడ్పీటీసీలు, 54 ఎంపీటీసీలకు ఎన్నికలుంటాయి. 94 ప్రాంతాల్లో 296 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది విడత 1,43,874 మం ది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మూడు విడతలుగా ఎన్నికలు పూర్తయిన అనంతరం మే 27న ఓట్లు లెక్కించి, తుది ఫలితాలు వెల్లడిస్తారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles