అకాల వర్షం.. అపార నష్టం

Sun,April 21, 2019 01:54 AM

పాలకుర్తి : మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మండలకేంద్రానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ ఇంటి రేకులు గాలులకు ఎగిరిపడి పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి చిందరవందరగా పడిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే, తోటల్లో మామిడి కాయలు రాలిపోగా, వరి పంటకు నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

లింగాలఘనపురం : కుందారంలో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలలతో కూడిన వర్షంతో కోతకొచ్చిన వరి పంటకు నష్టం కలిగింది. కాగా, నెల్లుట్ల, లింగాలఘనపురం, కళ్లెం, నవాబుపేట, కుందారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లను కప్పి పంట నష్టపోకుండా రక్షించుకున్నారు.

నర్మెట : మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి చేలల్లో వడ్ల గింజలు నేల రాలాయి. మామిడి తోటల్లో కాయలు రాలగా, కొన్నిచోట్ల ఇంటి పైకుప్పు రేకులు పూర్తిగా పగిలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

80
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles