రైతులకు అసౌకర్యం కలిగించొద్దు

Sun,April 21, 2019 01:54 AM

దేవరుప్పుల, ఏప్రిల్ 20 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఓజే మధు అన్నారు. మండలంలోని సింగరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. తేమశాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే వెంటనే కాంటా వేస్తారని పేర్కొన్నారు. రైతులు బ్యాంకు ఖాతా వివరాలు జిరాక్స్‌ప్రతులు విధిగా నిర్వాహకులకు అందజేస్తే వెంటనే ధాన్యం డబ్బులు ఆ ఖాతాలో జమచేరన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులకు నీడ, తాగునీరు వసతి ఉండాలని, వర్షంలో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు సరఫరా చేయాలన్నారు. వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. సింగరాజుపల్లి, చినమడూరు, దేవరుప్పుల కొనుగోలు కేంద్రాలు ఉండగా ఇప్పటి వరకు 30 మంది రైతులు 800 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినట్టు సొసైటీ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో కృష్ణమూర్తి ఉన్నారు.

రైతు సహకార సంఘం సిబ్బందిపై జేసీ ఓజే మధు ఆగ్రహం
కొడకండ్ల : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన సదుపాయాలను కల్పించాలని జేసీ ఓజే మధు ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొడకండ్లలో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు సక్రమంగా జరగడం లేదని జేసీకి కొందరు రైతులు ఫిర్యాదు చేయగా, సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్ కాంటాలను వాడాలని ఆయన సూచించారు.

ఏఎంసీలో బోర్లు పనిచేయడం లేదని అధికారులు జేసీ దృష్టికి తీసుకురాగా మార్కెట్ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బోర్లు వేయించాలని ఆయన కోరారు. రైతుల వద్ద కొనుగోళ్లు చేసిన ధాన్యానికి 48 గంటలలోపు డబ్బులు అందచేసేలా చర్యలు తీసుకోవాలని, వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జేసీ వెంట అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, తహసీల్దార్ హమీద్, తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles