వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన జేడీఎం

Sun,April 21, 2019 01:53 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, ఏప్రిల్ 20 : స్టేషన్‌ఘన్‌ఫూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని శనివారం జేడీఎం మల్లేశం సందర్శించారు. ఈసందర్భంగా మార్కెట్‌లో రైతులు నిల్వ చేసుకున్న ధన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌ఫూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో ప్రతీ రోజు వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతున్నట్లు వచ్చిన వార్తల మేరకు మార్కెట్‌ను సందర్శించినట్లు తెలిపారు. వాస్తవానికి స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో కాంటాల సంఖ్య తక్కువగా ఉందని, అలాగే హమాలీలు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ పరిధిలో కాంటాల సంఖ్యను పెంచాలని, హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. రోజకు 3వేల నుంచి 4వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కాంటా వేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ పరిధిలో టార్పాలిన్ షీట్ల కోసం ఇతర జిల్లాల నుంచి తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని, కొత్తగా టార్పాలిన్ షీట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీడీఎం అజ్మీరా రాజు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ జే హరీశ్, మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏఎంఎస్ యూసూప్ షరీఫ్, మార్కెట్ సిబ్బంది తాటికొండ శ్రీనివాస్, బూర వెంకటేశ్, గుండె రాంచందర్, ఎస్‌కే షరీఫ్, గట్టు మోహన్, అనిల్‌తో పాటు రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles