మన సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శం

Sat,April 20, 2019 01:43 AM

జనగామ రూరల్ : తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మండలంలోని శామీర్‌పేటలో శుక్రవారం వార్డుల్లో ఉన్న చెత్తచెదారం, డ్రైనేజీ పనులను గ్రామస్తులు తొలగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడారు. గ్రామాలు శుభ్రంగా ఉంటేనే అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అందుకు గ్రామస్తులు కలసికట్టుగా వార్డుల్లో చెత్తచెదారంను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రల్లో సైతం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే దేశం సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూస్తోందని తెలపారు. కొద్ది రోజుల క్రిం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో ఏరాష్ట్రంలో రాని మేజార్టీ కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులుచేసిన వారికే రానున్న స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామన్నారు. అందరూ కలసి గ్రామాన్ని శుభ్రపరుచుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌కు లక్ష్యంతో పనిచేసే వారే ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని, అలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం నూతన చట్టం తీసుకురాబోతుందని ఆయన వివరించారు. గ్రామంలోని పాఠశాలలో మొక్కలకు రక్షణగా కంప చెట్లు నాటి నీటిని పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదగిరిగౌడ్, కొమురవెల్లి దేవాస్థానం చైర్మన్ సేవెల్లి సంపత్, మండల అధ్యక్షుడు కళింగరాజు, మాజీ సర్పంచ్ రమాదేవి, నాయకులు మేకల రామకృష్ణ, బనుక సిద్దిరాజ్, గ్రామ అధ్యక్షుడు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles