వైభవంగా నాగేంద్రస్వామి కల్యాణం

Sat,April 20, 2019 01:43 AM

తొర్రూరు, నమస్తే తెలగాణ, ఏప్రిల్ 19: డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్రస్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం పూజా కార్యక్రమాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఉష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆల య అర్చకులు ఓలేటి యాదగిరిచార్యులు, గీతాచార్యులు, ఆలయ పూజారి మధుశర్మ ఆధ్వర్యంలో ఉద యం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించా రు. పంచసూక్త పఠనంతో నాగేంద్రస్వామికి గోక్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, ఫల రసాలతో అభిషేకా లు, అష్టోత్తర పూజ, మహా నివేదన, మంత్రపుష్పం కార్యక్రమాలను శాస్త్రీయంగా నిర్వహించారు. స్వామి వారిని నూతన వస్ర్తాలతో రకరకాల పుష్పమాలతో అలంకరించారు. అనంతరం నిర్వహించిన కళ్యాణోత్సవంలో స్వామి వారికి యజ్ఞోపధారణ, మధుపర్కం, మహాసంకల్పం, మాంగళ్యధారణ కార్యక్రమాలను లోకకళ్యాణార్ధం కన్నుల పండుగగా నిర్వహించారు.

ముడుపు విప్పి మొక్కు చెల్లించుకున్న మంత్రి దయాకర్‌రావు దంపతులు
పంచముఖ నాగేంద్రస్వామి కల్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో మంత్రి దయాకర్‌రావు, ఉష దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో దయాకర్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆయన సతీమణి ఉష ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టగా శుక్రవారం పూజ సందర్భంలో ముడుపు విప్పిన దయాకర్‌రావు, ఉష దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. పంచముఖ నాగేంద్రస్వామి ఆశీస్సులతో మంత్రి పదవి కూడా దక్కిందని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే లా శాయశక్తుల అభివృద్ధి కోసం పని చేస్తానని తన అనుకు నే వారు ఎవరు కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిత్యం ప్రజలకు సేవ చేసే వారుగా మంచితనంతో మెదిలేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరారు. కల్యాణోత్సవం, పూజా కార్యక్రమాలకు విచ్చేసిన దయాకర్‌రావు, ఉష దంపతులను ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపారపు నాగేశ్వర్‌రావు-విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొల్లూరి నాగేంద్రాచారి-కళావతి, కోశాధికారి దార నాగశిప్రసాద్-శేషుకుమారి, గౌరవ అధ్యక్షుడు చకిలేల నాగరాజు-అలివేలు దంపతులు, మణికుమార్‌తో పాటు సభ్యులు కలిసి బొడ్రాయి వద్ద నుంచి పూజారుల వేదమంత్రోచ్ఛారణ నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం, శేషవస్ర్తాలను అందించి గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమయ్య-సద్గుణమ్మ, డాక్టర్ రాజేందర్‌రెడ్డి-గీత, దాతలు వేదమిత్ర-తేజస్వి, దయాకర్-కళావతి, అమరేందర్- రమాదేవి దంపతులు, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సీతారాములు-శాంత, దొంగరి శంకర్-రేవతి దంపతులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేశ్, టీఆర్‌ఎస్ నేతలు, భక్తులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles