సీఎం సహాయనిధితో పేదలకు భరోసా


Sat,April 20, 2019 01:42 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, సీఎ సహాయనిధి పేదలకు భరోసాగా నిలిచిందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదరపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాచర్ల గణేష్ తండ్రి శ్రీశైలం కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం శ్రీశైలం కుటుంబానికి రూ.2 లక్షల సీఎం రీలీఫ్ ఫంఢ్ ఎల్‌ఓసీని ఎమ్మెల్యే రాజయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర చికిత్సలు పొందుతూ చికిత్సల ఖర్చులను భరించలేని వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వివరించారు. టీఆర్‌ఎస్ విధానాలపై దేశ రాజకీయాలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రజా ఉపయోగ పథకాలను అందించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆకుల కుమార్, మాలోత్ రమేశ్ నాయక్, నాయకులు చందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మాచర్ల రంజిత్, కుమారస్వామి, ఎల్లగౌడ్, భానుప్రకాశ్, సాగర్‌రెడ్డి, రఘురెడ్డి, రఘురాములు, ధర్మారెడ్డి, గాదె పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

86

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles