పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

Fri,April 19, 2019 03:18 AM

- రేపు షెడ్యూల్ విడుదల
- ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో పోలింగ్
- జిల్లాలో 140ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీలకు ఎన్నికలు

సుబేదారి, ఏప్రిల్ 10: నగరా మోగిం ది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షె డ్యూ ల్ విడుదలైంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. మూడు విడతల్లో పోలింగ్ జరుగనున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 791 ఎంపీటీసీ, 71 జెడ్పీటీసీ స్థానాలు ఉ న్నాయి. ఇందులో జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా 140 ఎంపీటీసీ లు, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్ మే 23 వ తేదీతో ముగియనుంది. ఈలోపే స్థా ని క ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ ని ర్ణయించింది. ఈ మేరకు 20 రోజుల క్రిత మే స్థానిక సం స్థల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. ఉమ్మడి వరంగల్ (వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మ హబుబాబాద్, జనగామ) ఆరు జిల్లాల్లో గ్రామాలు, మండల వారీగా 791 ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ 71, ఎంపీపీ 71 స్థానాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈక్రమంలో ఎన్నికల ఏర్పాట్లను సైతం అధికారులు పూర్తి చేశారు.

పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణకు సబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఉమ్డి జిల్లాలోని గ్రామాల వారీగా పోలింగ్ కేం ద్రాల ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. వీటికి సంబంధించి 20 రోజుల క్రితమే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఎంపీడీవోలు ఆయా మండలాల వారీగా జారీ చేసి ఓటర్ల సం ఖ్యను బట్టి ఎక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేయాలనే విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పాత వరంగల్‌లో 50 మండలాలు, పెరిగిన 21 మండలాలకు కలిపి ఎంపీటీసీ స్థానాలు వారీగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు.

అధికారులకు శిక్షణ పూర్తి
స్థానిక ఎన్నికల సంబంధించి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామ కం నెల క్రితమే జిల్లాల వారీగా నియామకం జరిగింది. వారం రోజుల క్రితం ఆర్‌వో, ఏఆర్‌ఓవోలకు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తయింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహ ణ అనేది బ్యాలెట్ పత్రాలతో జరుగుతున్నం దున ఈసారి సైతం ఇదే పద్ధతిని రా ష్ట్ర ఎన్నికల సంఘం కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడంతో అధికారు లు జిల్లాల వారీగా కావాల్సిన బ్యాలెట్ పత్రా లు, ఇతర స్టేషనరీ సైతం అందుబాటులో ఉంచారు.15 రోజుల క్రితమే ఈ ఎన్నికల కు సంబంధించి గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను ఆయా ్ల కలెక్టర్లు ప్రకటించారు.

మూడు విడతల్లో ఎన్నికలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూ ల్ మూడు విడతలుగా అధికారులు ఖరా రు చేశారు. తొలి విడత నోటిఫికేషన్ 22, మే 6వ తేదీన పోలింగ్ రెండో విడత నోటిఫికేషన్ 26వ తేదీన రానున్నది. మే10వ పో లింగ్, మూడో నోటిఫికేషన్ 30, మే 14 పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 20వ తేదీన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles