పల్లె ప్రగతే సీఎం ధ్యేయం

Fri,April 19, 2019 03:17 AM

జనగామ రూరల్, ఏప్రిల్ 18: పల్లెల ప్రగతే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని, సీఎం అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాల పరిపుష్టికి కృషి చేస్తున్నమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని చీటకోడూరులో గురువారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పారిశుధ్య పనులు చేపట్టారు. వీధులను పారతో స్వయంగా ముత్తిరెడ్డి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ప్రజాప్రతినిధులు వాగ్దానాలు చేశారే తప్ప గ్రామాలను అభివృద్ధి చేయలేదన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేసిన తర్వాతే ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో చెత్తాచెదారం తొలగించి, మురుగు కాల్వలను శుభ్రం చేయించిన వ్యక్తిని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించి నామినేషన్ వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

కేసీఆర్‌ది జనరంజక పాలన..
ప్రజలు ఏది కోరుకుంటున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చేస్తారని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాలను శుభ్రపర్చిన తర్వాతే పార్టీ గ్రామ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తామని, కార్యకర్తలు, నాయకులు పార్టీ విధివిధాలనకు కట్టుబడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. జనగామ నియోజకవర్గానికి గోదావరి జలాలను అందించిన కేసీఆర్ వెంటనే ప్రజలు ఉన్నారన్నారు. ప్రదేశిక ఎన్నికల్లో గెలిపించి టీఆర్‌ఎస్ సత్తా చాటాలన్నారు. జనగామ నుంచి చీటకోడూరు వరకు బీటీ రోడ్డుకు రూ. 1.80 కోట్లు మంజూరు చేశామని ముత్తిరెడ్డి తెలిపారు. ఎన్నికలు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఎమ్మెల్యే పిలుపుతో మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. ఆశవాహులు ఉత్సాహంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్, జెడ్పీటీసీ బాల్దె విజయ సిద్దిలింగం, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, సర్పంచ్ కొత్త దీపక్‌రెడ్డి, నాయకులు పసుల ఏబెల్, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లబోయిన కొమురయ్య యాదవ్, జైపాల్‌రెడ్డి, ఉపేందర్, రాజు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles