తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్

Fri,April 19, 2019 03:17 AM

లింగాలఘనపురం, ఏప్రిల్ 18: దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్.. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిపోయిందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్ అధ్యక్షతన గురువారం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైందని ఎద్దేవా చేశారు. టీడీపీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేశారని విమర్శించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు ఏ నాయకుడు ఎమ్మెల్యేగా గెలువలేదన్నారు. త్యాగాలకు పేరుగాంచిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు అరుదైన గౌరవాన్ని దక్కించారని అభినందినంచారు. టీఆర్‌ఎస్‌కు ఆయువు పట్టుగా ఉన్న లింగాలఘనపురం మండలంలో నాయకులు పోటీపడి రెబల్స్‌గా సర్పంచ్‌ల బరిలో నిలువడంతో పార్టీకి నష్టం కలిగిందన్నారు. ఈ పర్యాయం మండలంలో కలిసి కట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు. మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ఓపిక పడితే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పదవి తప్పకుండా దక్కుతుందన్నారు.

క్రమశిక్షణకు మారుపేరు టీఆర్‌ఎస్
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ క్రమశిక్షణకు మారుపేరుగల పార్టీగా గుర్తింపు తెచ్చుకుందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్నికల ఇన్‌చార్జి వాసుదేవరెడ్డి అన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎంతటి వారినైనా సీఎం కేసీఆర్ ఉపేక్షించరన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. కాగా, కార్యకర్తలకు ఎమ్మెల్యే రాజయ్య క్లాస్ తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారు పద్ధతి మార్చుకుంటే మంచిదని సూచించారు. కొందరు నాయకులు పనిగట్టుకుని పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని, జాగ్రత్తగా వ్యవహరించకుంటే పార్టీపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం జీడికల్, నేలపోగుల గ్రామాలకు చెందిన ఇతర పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరగా, ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పలువురు ఆశావహులు అందించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. కార్యక్రమాల్లో కొమురవెల్లి ఆలయ కమిటీ చైర్మన్ సేవెల్లి సంపత్, జెడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, ఎంపీపీ బోయిని శిరీష, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు వంచ మనోహర్‌రెడ్డి, మండల కో ఆర్డినేటర్ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, నామాల బుచ్చయ్య, దూసరి గణపతి, దుంబాల భాస్కర్‌రెడ్డి, చిట్ల ఉపేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, చౌదరపెల్లి శేఖర్, పోకల శంకరయ్య, నెల్లుట్ల రవీందర్‌రావు, గండి యాదగిరి, గవ్వల మల్లేశం, ఏదునూరి వీరన్న, ఎడ్ల రాజు, గండి శ్రీనివాస్, ఉడుగుల భాగ్యలక్ష్మి, మర్రి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles