టీఆర్‌ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ శోభన్ మృతి

Fri,April 19, 2019 03:17 AM

సుబేదారి, ఏప్రిల్18: జిల్లా పరిషత్ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సకినాల శోభన్ ఇ టీవల అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ..గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని హన్మకొండ నక్కలగుట్టలోని ఆ యన స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, పలు వురు జెడ్పీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి దయాకర్ రావు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ..సకినాల శోభన్ టీఆర్‌ఎస్ కీలక, క్రమశిక్షణ గల నాయకుడిగా ఎదిగారని, జెడ్పీ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా పదవికి తగిన గుర్తింపు తీసుకువచ్చారని గుర్తు చేశారు. శోభన్ కుటుంబానికి టీఆర్‌ఎస్ అధిష్టానం అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా శోభన్ ములుగు జిల్లా బండారుపల్లి గ్రామ వాసి. తొలుత టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసి మాజీ మంత్రి చందూలాల్‌కు ప్రధాన అనుచరుడిగా పనిచేశాడు. రెండుసార్లు ఎ ంపీటీసీగా, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి టీ ఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో చేరి ములుగు జెడ్పీటీసీగా ఎన్నికై జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా ఎదిగాడు.

50
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles