జనం మెచ్చిన నాయకుడికే టికెట్

Thu,April 18, 2019 01:57 AM

- పారిశుధ్య పనులు చేసిన వారికే బీ-ఫారం
- టీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా పని చేయాలి
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- గ్రామాల్లో ప్రక్షాళన చేయాలని ఏకగ్రీవ తీర్మానం

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 17: గ్రామాల్లోని పాఠశాలలు, వార్డుల్లో డ్రైనేజీలు, చెత్తాచెదారం తొలగించడం, తాగునీటి పైపులు, నల్లా కనెక్షన్ల లీకేజీలను అరికట్టడం, విద్యుత్ లైన్లు సరిచేయడం, అన్ని వీధిలైట్లు వెలిగేలా చూడడం, రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి గ్రామానికి ఉపయోగపడే పనులు చేసి జనం మెచ్చిన పార్టీలో సీనియర్ నాయకుడికి తానే స్వయంగా గ్రామానికి వచ్చి టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ టికెట్లు ప్రకటించే వరకూ గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన ఆశావహులే పారిశుధ్య పనులు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసే నాయకులు, కార్యకర్తలపై పార్టీపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జనగామ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని బుధవారం జనగామ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా సామాన్యుడికి సకాలంలో రూపాయి ఖర్చు లేకుండా పనులు జరిగేలా రెవెన్యూ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్, విద్యుత్ వంటి ప్రభుత్వ శాఖల ప్రక్షాళనకు నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో కార్యకర్తలంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

అంతటా గులాబీ జెండా ఎగరాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యరులను గెలిపించుకునేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అఖండ మెజార్టీ సాధించిందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ అదేస్థాయిలో ఫలితాలు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి పటిష్టమైన పునాది ఉన్నందున వందేళ్ల వరకు తిరుగులేని అజేయశక్తిగా నిలిపేందుకు యువనేత కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగించారని ముత్తిరెడ్డి తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ గుజ్జ సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా కో ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జెడ్పీటీసీ బాల్దె విజయ, ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ బండ పద్మ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు శారద, జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల అధ్యక్షుడు మేకల కళింగరాజు, గౌస్ పాషా, చంద్రారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, పసుల ఏబెల్, రాంరెడ్డి, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, జార్జిరెడ్డి, కమలాకర్‌రెడ్డి తదితరులు హాజరయారు.

74
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles