ప్రాదేశిక ఎన్నికల్లో... టీఆర్‌ఎస్ సత్తా చాటాలి

Thu,April 18, 2019 01:57 AM

పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 17: త్వరలో జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావుతో కలిసి నియోజకవర్గ స్థాయి ఏరియా కమిటీ ఇన్‌చార్జీలు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ విధేయులు, గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే వార్ వన్‌సైడ్ అయిందని, ప్రతిపక్షాలు అభ్యర్థులను పెట్టే స్థితిలో లేవని ఎద్దేవా చేశారు. సర్వే ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇస్తానన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, నాయకులకే ప్రాధాన్యం ఉంటుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ పరిశీలకులు అన్ని గ్రామాల్లో పర్యటించి.. టికెటు ఆశిస్తున్న రెండు లేదా మూడు పేర్ల జాబితాను అధిష్టానానికి అందించాలని సూచించారు. తుది నిర్ణయం జిల్లా, రాష్ట్ర కమిటీలకే ఉంటుందన్నారు. గ్రూఫు విభేదాలతో పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.

ప్రతీ మండలానికో పరిశీలకుడు
అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ మండలానికి ఇన్‌చార్జీ పరిశీలకుడు ఉంటారని మంత్రి చెప్పారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు జన్ను జకారియా, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు పరంజ్యోతి ఎన్నికల పరిశీలకులుగా ఉంటారని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో మండల కమిటీలు, పరిశీలకులు గ్రామాల్లో పర్యటించి ఆశావహుల పేర్లను అందించాలని సూచించారు. ఎంపీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకప్రాత పోషించబోతున్నారని ఆకాంక్షించారు. సమావేశంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు, ఎన్నికల పరిశీలకులు జన్ను జకారియా, పరంజ్యోతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఈదురు ఐలయ్య, వసుమర్తి సీతారాములు, జినుగు అనిమిరెడ్డి, బస్వమల్లేశం, వీ రాంచంద్రయ్య శర్మ, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, బిల్లా సుధీర్‌రెడ్డి, జాటోత్ నెహ్రూనాయక్, కుర్ర శ్రీనివాస్, కాకిరాల హరిప్రసాద్‌రావు, రామసాయం కిశోర్‌రెడ్డి, డాక్టర్ సోమేశ్వర్‌రావు, కొత్త జలేందర్‌రెడ్డి, దీకొండ వెంకటేశ్వర్‌రావు, పేరం రామ్, సిందే రామోజీ, ఆకుల సురేందర్‌రావు, రంగు కుమార్, ఎంపీపీ కొల్లూరు సోమయ్య, బానోత్ వెంకన్న, జర్పుల బాలునాయక్, వీరమనేని యాకాంతారావు పాల్గొన్నారు.

పాలకుర్తిలో కాంగ్రెస్ ఖాళీ..!
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అ న్నారు. మంచుప్పుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భూమండ్ల రమేశ్, పడమటింటి భాస్కర్‌తోపాటు పదిమంది సర్పంచ్ బొమ్మగాని కొమురయ్య ఆధ్వర్యంలో ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ చైర్మన్ అడ్డూరి మాధవరావు, పుస్కూరి శ్రీనివాసరావు, పసులాది వెంకటేశ్, ఎంపీటీసీ బానోత్ యాకూబ్, బీ వెంకన్న, బీ శ్రీనివాస్, వాసురావు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles