తెలంగాణ సంస్కృతిని చాటిన జాగృతి

Wed,April 17, 2019 01:59 AM

-జీసీసీ చైర్మన్ మోహన్‌గాంధీ నాయక్
కొడకండ్ల, ఏప్రిల్16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటిన ఘనత జాగృతి సంస్థకే దక్కిందని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీ నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధి గిర్ని తండా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జాగృతి మహిళా విభాగం గ్రామ అధ్యక్షురాలిగా నల్ల శోభను ఎంపిక చేశారు. దీనికి మోహన్‌గాంధీ నాయక్‌తోపాటు జాగృతి మహిళా విభాగం మండల అధ్యక్షురాలు వక్కి శోభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌గాంధీ నాయక్ మా ట్లాడుతూ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంస్థను స్థాపించినప్పటి నుంచి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతోందన్నారు. ముఖ్యంగా బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రంలోనే కా కుండా దేశ, విదేశాల్లో నిర్వహించి పండుగ ప్రాధాన్యతను చాటి చెప్పిందన్నారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ ధరావత్ రాజ్‌కుమార్ నా యక్, స్థానిక టీఆర్‌ఎస్,జాగృతి నాయకులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles