జఫర్‌ఘడ్‌లో ఉపాధి శిక్షణ కార్యక్రమం

Wed,April 17, 2019 01:59 AM

జఫర్‌ఘడ్, ఏప్రిల్ 16 : జఫర్‌ఘడ్ మండలం లోని ఆయా గ్రామాల నిరుద్యోగ యువతీ, యువకులకు నేడు(బుధవారం) ఉచిత శిక్షణ, ఉపాధి మేళాను నిర్వహిస్తున్నట్లు సన్ సిల్క్స్(డీడీయూ-జీకేవై) కోఆర్డినేటర్ బీ రాజేందర్ తెలిపారు. జఫర్‌ఘడ్‌లోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బల్లెపు నరేశ్‌ను ముఖ్య అతిధిగా మంగళవారం ఆయన ఆహ్వానించారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువతీ, యువకులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం, రాష్ట్ర ప్రభుత్వం (ఈజీఎంఎం)శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సన్ సిల్క్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్వెంటరీ క్లర్క్, టూరిజం, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బీవరేజెస్, సర్వీస్ స్టిక్కర్స్, హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్‌మెంట్ తదితర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాజేందర్ తెలిపారు. శిక్షణా సమయంలో ఉచిత భోజనం, వసతి, స్టడీ మెటీరియల్, రూ.3 వేలు నగదు, శిక్షణా సర్టిఫికెట్స్ అందచేస్తామని రాజేందర్ తెలిపారు. మం డలం లోని నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజేందర్ కోరారు.

38
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles