నువ్వు తోపురా.. నటీనటుల సందడి

Wed,April 17, 2019 01:58 AM

జనగామ టౌన్, ఏప్రిల్ 16 : జనగామ జిల్లా కేంద్రంలో నువ్వు తోపురా.. సినీ నటులు మంగళవారం సందడిచేశారు. మంగళవారం రాత్రి హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్, నువ్వు తోపురా సినిమా హీరో నాగరాజు, నటి నిత్య జనగామలో కాసేపు ఆగారు. ఈమేరకు జనగామకు చెందిన అమ్మ ఫౌండేషన్ బర్త్‌డే ట్రీ సంఘం నాయకులు, సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వహకులు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం సీజన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎదుట మొక్కలను నాటారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లా వాసులందరూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి పచ్చదనానికి పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. నట్డు నాగరాజు మాట్లాడుతూ.. ఇంతకుముందు తాను అనేక సినిమాల్లో సైడ్‌యాక్టర్‌గా నటించానని, ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నువ్వు తోపురా చిత్రంలో తానే మెయిన్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఈసినిమాను మే 3న విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు చూసి తమ అభిప్రాయాలను తెలపాలని ఆయన కోరారు. అలాగే జనగామ యువత కోరిక మేరకు సినిమాలోని ఒక డైలాగ్‌తో పాటు అనుభవాలను తెలుపుతూ ఎవరికి వారే తోపులమన్నారు. అదేవిధంగా సీజన్స్ రెస్టారెంట్‌లో బిర్యానీ, కాఫీ అద్భుతంగా ఉందని, త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కోరిక మేరకు జనగామ నుంచి మరో సినిమాకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా ఈవెంట్ ఆర్గనైజర్ హరీశ్, సీజన్స్ రెస్టారెంట్ నిర్వాహకులు మహ్మద్ శాబాజ్, మహ్మద్ శాణావాజ్, మహ్మద్ అబ్బాస్, మంతెణ మణి, మంగళంపల్లి రాజు, రవి, రమేశ్, విష్ణు, శ్రీకాంత్, ఉపేందర్, ప్రవీణ్, రాహుల్‌తో పాటు జనగామకు చెందిన పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles