ప్రశాంతంగా పాలిసెట్

Wed,April 17, 2019 01:58 AM

జనగామ, నమస్తే తెలంగాణ/స్టేషన్‌ఘన్‌ఫూర్, నమస్తే తెలంగాణ : పాలిటిక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2019 పరీక్షలు జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 1450 మంది విద్యార్థులకు గానూ 1417 మంది హాజరవ్వగా 33 మంది గైర్హాజరయ్యారని పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జీ పోచయ్య ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలో నిర్వహించిన పరీక్ష కేంద్రాల వద్ద సీఐ రాజిరెడ్డి, ఎస్సై రవి ఆధ్వర్యంలో సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లుచేశారు. పాలిసెట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందికి పోచయ్య కృతజ్ఞతలు తెలిపారు.

43
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles