జనగామలో ఐపీఎల్ బెట్టింగ్


Wed,April 17, 2019 01:58 AM

జనగామ టౌన్, ఏప్రిల్ 16: జనగామ జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న స్థావరాలపై వెస్ట్‌జోన్ పోలీసు లు సోమవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్టు చే సి రిమాండ్‌కు తరలించినట్లు జనగామ సీఐ మల్లేశ్‌యాదవ్ తెలిపారు. మంగళవారం జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెట్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నాటి నుంచి జిల్లా కేంద్రంలోని లోని కుర్మవాడ, బీరప్పగడ్డ, గుండ్లగడ్డ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందని ఇంటిలిజన్స్ వర్గాల నుంచి పో లీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం రాత్రి జనగామ ఎస్సై రాజేశ్‌నాయక్‌తో పాటు కానిస్టేబుళ్లు సంతోష్, సతీష్, కృష్ణ బృందం కుర్మవాడ, బీరప్పగడ్డలో ఆకస్మిక దాడులను నిర్వహించారు.


ఈ సందర్భంగా కుర్మవాడలో కొంతమంది సెల్‌ఫోన్‌లతో ముంబై, బెంగళూర్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. అందు లో నోముల నర్సింహులు, ఎం శ్రీధర్, ఎం లక్ష్మణ్‌కుమార్, ఎండీ రహీంను రెడ్‌హాండెడ్ గా పట్టుకోగా, ఎం రాజ అనే వ్యక్తి పరారయినట్లు తెలిపారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్‌లు , రూ.6,980 నగదు స్వాధీనం చేసుకు ని నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. అలాగే ఐపీఎల్ బెట్టింగ్‌కు పా ల్పడుతున్న వ్యక్తుల వద్ద లభించిన ఆధారాలతో మరో 20 మంది యువతను గుర్తించామని, త్వరలోనే వారందరినీ పట్టుకుని కో ర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని, వారందరినీ గు ర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా, ఎవరైనా బె ట్టింగ్‌కు పాల్పడినా, ప్రభుత్వ నిషేధించిన గు ట్కా, మట్కాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో ఎస్సై రాజేశ్‌నాయక్, కానిస్టేబుళ్లు సంతోష్, వీరన్న, అనిల్, కిషోర్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

98

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles