వడదెబ్బతో నలుగురు మృతి

Wed,April 17, 2019 01:58 AM

-పాంనూర్‌లో ముగ్గురు మహిళలు
-శివునిపల్లిలో వృద్ధుడు..
-మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పరామర్శ
స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ ఏప్రిల్16: రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 40 డిగ్రీలు దాటుతుండడం తో జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు వేడి తీవ్రతను తట్టుకోలేక వ డదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. ఈ క్ర మంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం నలుగురు ఎండతీవ్రత తట్టుకోలేక చనిపోయారు. ఇందులో పాంనూరుకు చెందిన ముగ్గురు మహిళలు మృతిచెం దడంతో గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌ఫూర్ మండలం పాంనూర్ గ్రామానికి చెం దిన మండల కళమ్మ (42) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం మధ్యా హ్నం ఎండ తీవ్రత ఎక్కువకావడంతో అస్వస్థతకు గురై రాత్రి చనిపోయింది. అదే గ్రామానికి చెందిన బత్తిని వెంకటమ్మ (50) నెల రోజులుగా అనారోగ్యం తో ఇబ్బంది పడుతోంది. ఎండ తీవ్రత తట్టుకోలేక మంగళవారం ప్రాణాలు విడిచిందని కుటుంబసభ్యు లు తెలిపారు. అలాగే కందుకూరి రుక్కమ్మ (56) మంగళవారం మధ్యాహ్నం వడదెబ్బకు గురైయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె పరిస్థితి విషమించి సాయంత్రం చనిపోయింది. కాగా ఒకే గ్రామానికి ముగ్గురు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని శివుని పల్లికి చెందిన టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తోట సత్యం తండ్రి తోట వీరయ్య (70) వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మం చినీరు తాగిన వెటనే కిందపడిన వృద్ధుడిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లాలని 108కు ఫోన్ చేశారు. సిబ్బంది వచ్చి అతడిని పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్యతోపాటు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు మృతుడికి కుటుంబాన్ని పరామర్శించారు.

41
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles