అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి ప్రదాత

Mon,April 15, 2019 01:34 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 14 : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా క్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్ర దాత అని, ఆయన ఆశయ సాధనకు అం దరం కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా ఆదివారం అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలను పూలమాలతో ముంచెత్తి ఘ నంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రం లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌వో శంకర్, ఎస్సీ అభివృద్ధిశా ఖ అధికారి గట్టుమల్లు, అర్బన్ సీఐ మల్లే శ్, డాక్టర్ సు గుణాకర్‌రాజు, డాక్టర్ సీ హెచ్ రాజమౌళి, ఎన్‌ఆర్‌ఐ పగిడిపాటి దేవయ్య, చింతల మల్లికార్జున్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జనగామ అంబేద్కర్ చౌరస్తా వద్ద గిరిమల్ల రాజు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మా ట్లాడుతూ భారత రాజ్యాంగం రచించి దే శానికి దశ, దిశను నిర్ధేశించిన అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. భారతదేశం గర్వించదగిన ప్రపంచ మేధా వి అంబేద్కర్ అని కొనియాడారు. బాబా సాహెబ్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ భారతదేశ ఆస్తి అ న్నా రు.

దళితులు విద్యాపరంగా, ఆర్థికంగా బ లపడినప్పు డే అభివృద్ధి సాధ్యమవుతుందన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. దళితులకు విదేశాల్లో విద్య కోసం ఆర్థిక సాయం, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ, స్కాలర్‌షిప్‌లను ప్రభు త్వం అందిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సహా దళితులు ప్రభుత్వం అందిం చే పథకాలను సద్వినియోగం చేసుకొని అ భివృద్ధి దిశగా ఎదగాలని కోరారు. నిరుపే ద విద్యార్థులకు పెద్ద చదువులు, విదేశీ వి ద్య కోసం ఒక్కొక్కరికి రూ.20లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు చె ప్పారు. ప్రతీ ఒక్కరికి చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం అందరికీ వ ర్తింపజేసేలా అంబేద్కర్ రాశారని గుర్తు చేశారు. వచ్చే జయంతి వరకు జిల్లా కేం ద్రంలో అంబేద్కర్ భవనం నిర్మించుకునే దిశగా ప్రయత్నిద్దామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను జిల్లాలో పకడ్బందీగా అ మలు చేసి ప్రతి పైసా దళిత లబ్దిదారులకు అందేవిధంగా చూస్తానని చెప్పారు.

అట్రాసిటీ కేసులపై ప్యానల్ కమిటీ వేసి ఎలాం టి ఒత్తిళ్లు లేకుండా చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందరం ఒకవైపు.. ఒకే బాటగా చేయిచేయి కలిపి ముందుకు సాగి అందరం కలిసి జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుదామని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తిప్పారపు విజయ్ కుమార్, నీర్మాల రాములు, మల్లిగారి మధు, కౌన్సిలర్లు కన్నారపు ఉపేందర్, మెడే శ్రీనివాస్, దేవరాయి ఎల్లయ్య, కొలిపాక బాలయ్య, ఉడుగుల రమేశ్, మల్లిగారి మధు, పసుల ఏబెల్, రావెల రవి, కన్నారపు పరశురాములు, శివశంకర్, లక్ష్మణ్‌నాయక్, పులి స్వామి, బొట్ల చిన్నశ్రీనివాస్, స్వామి నాయక్, చెప్పాల ప్రసాద్, జేరిపోతుల కుమార్, కందుకూరి ప్రభాకర్, కొయ్యడ భాస్కర్, బక్క శ్రీను, శాగ కైలాసం, సాదిక్‌ఆలీ, గట్టగల్ల సం జీవ్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి కలెక్టర్, డీసీపీ సహా అన్నిపార్టీలు, ప్రజా సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి భారీ కేక్‌కట్ చేసి సహపంక్తి భో జనం చేశారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles