బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్

Mon,April 15, 2019 01:32 AM

పాలకుర్తి రూరల్ ఏప్రిల్ 14: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం అంబేద్కర్ 128వ జయంతిని మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాజ్యంగా నిర్మాతగా జాతికి దిశానిర్ధేశం చేసిన గొప్ప మహానుబావుడు అంబేద్కర్ అని, అయన మానవ జాతికి మార్గదర్శి అని కొనియాడారు. బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నడుస్తున్నారన్నారు. అంతరాలు లేని భారత సమాజం కోసం పరితపించిన అంబేద్కర్ బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీనాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, పుస్కూరి శ్రీనివాసరావు, పసునూరి నవీన్, కమ్మగాని రమేశ్, ఎండీ అబ్బాస్‌ఆలీ, నోముల సతీష్, గాదెపాక శ్రీనివాస్, కమ్మగాని నాగన్న, గుగులోత్ పార్వతి, ఎన్ శ్రీనివాస్‌రావు, బెల్లి యుగేందర్, కటారి పాపారావు, శివరాత్రి సోమయ్య, ఎడవెల్లి పురుషోత్తం, కారుపోతుల వేణు, పూజారి మధు తదితరులు పాల్గొన్నారు. కాగా హైదరాబాద్ నుంచి పాలకుర్తికి వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ మండలం పెంబర్తిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జెడ్పీటీసీ బాల్దె విజయసిద్దిలింగం, సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఎంపీటీసీ మోత్కూరి కావ్యశ్రీకిషన్, డాక్టర్ రాజమౌళి, రత్నం, ఆకుల శ్రవన్, ఇబ్రహీం కలిసి నివాళులర్పించారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles