దార్శనికుడు బాబాసాహెబ్

Mon,April 15, 2019 01:32 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్ప దార్శనికుడని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు మండల కేంద్రాలతోపాటు వెంకటాద్రిపేట, వంగాలపల్లి, రాజవరం, మల్కాపూర్ తదితర గ్రామా ల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిని వేడుకల్లో ఆయన పాలొని ఆయా గ్రామాల్లోని విగ్రహాలకు పూ లమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత రం గ్రామాల్లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రాజయ్య హాజరై మాట్లాడారు. సమాజంలో అసమానతల నిర్మూలనకు అంబేద్కర్ కృషి చేయడంతో పాటు రాజ్యాంగ రచన ద్వారా దేశానికి దిశా నిర్ధేశం చేశాడన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే లక్ష్యంగా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు.

అంబేద్కర్ దూర దృష్టితోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సీహెచ్ నరేందర్‌రెడ్డి, ఆకుల కుమార్, మారపాక రవి, టీఆర్‌ఎస్ మండల పార్టీ ఇన్‌చార్జి పాగాల సంపత్‌రెడ్ది, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, పార్టీ మండల అధ్యక్షులు పోగుల సారంగపాణి, పోలెపెల్లి రంజిత్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి బాలరాజు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీ సురేశ్‌కుమార్, నీల ఐలయ్య, కందుల రఘుపతి, మారపెల్లి తిరుమల క్రిష్ణామోహన్‌రెడ్డి, ఉద్దెమారి రాజ్‌కుమార్, ఎంపీటీసీలు డాక్టర్ సత్యనారాయణరాజు, ఎస్. దయాకర్, గోనెల ఉపేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణ అధ్యక్షులు మునిగెల రాజు, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles