వైభవంగా సీతారాముల కల్యాణం

Mon,April 15, 2019 01:31 AM

జనగామ టౌన్, ఏప్రిల్ 14: చైత్రశుద్ధ నవమి.. పునర్వసు నక్షత్రం.. సుముహూర్తాన.. వేదమంత్రాల సాక్షిగా.. అశేష భక్తజనం నడుమ జిల్లా కేంద్రంలో వాడవాడల సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీతారాముల వివాహ వేడుక కనుల పండువలా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలన్ని కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జనగామలోని పాతబీట్ బజార్‌లో శ్రీరామ నవరాత్రోత్సవ కమిటీ, గణేశ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణమాచార్య సిద్ధాంతి, బ్రహ్మశ్రీ అప్పయ్యశాస్త్రి వేద మంత్రోశ్చరణల నడుమ సీతారాముల కల్యాణం జరిపించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సతీమణి పద్మలతారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మయాదగిరిరెడ్డి స్వామివారిని కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు సీతారాముల కళ్యాణ మండపం వద్ద మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికి సీతారాముల తలంబ్రాలను పంచిపెట్టారు.

కార్యక్రమంలో కౌన్సిలర్ పన్నీరు రాధిక, నాగబండి సుదర్శనం, బజ్జురి గొపయ్య, పోకల వేణు, హన్మంతరావు, బజాజ్, అయిత శ్రీకాంత్, బచ్చు అశోక్, గోవింద్, పాండు, బిజ్జాల గోపాల్, గందె వేణు, పద్మనాభం, రాజేశ్వర్, బిజ్జాల నవీన్‌కుమార్‌గుప్తా, బుస్స లింగం, ప్రవీణ్, రామిని శివుడు, సురేష్‌తో పాటు వాసు, ప్రసాద్, బిజ్జాల సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో, అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, జనగామ ఆర్టీసీ డిపోలోని ఆంజనేయాలయంలో, జయశంకర్‌నగర్‌లోని హనుమాన్ ఆలయంతోపాటు పలు ఆలయాల్లో స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్ జక్కుల అనిత వేణుమాధవ్, గొలనుకొండ భీమయ్య, బెలిదె నాగరాజు, దామెర మల్లికాంబ, నాయిని ప్రకాశ్, ఉపేందర్‌రెడ్డి, వీరస్వామి, రాంరెడ్డి, కోటయ్య,కందుల రాజు, కృష్ణా, భూరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వేణు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్,మల్లేశ్, చిగురు నవీన్, శ్రీకాంత్, శ్రీకాంత్, సాయి, శ్రీను, సంపత్, జనగామ ఆర్టీసీ డీఎం సదాశివరావు, సీఐ శ్రీకాంత్, ఆర్టీసీ కార్మిక సిబ్బంది , కౌన్సిలర్ ఆకుల వేణుగోపాల్‌రావు, దొంతుల శేఖర్, కోడిపాక ప్రభాకర్, బాలనారాయణ, మంచాల రవీందర్, కృష్ణాముర్తి, నాగరాజు, రుద్రంవ వెంకటేష్, నారాయణ, పలువార్డులలో జరిగిన కల్యాణ వేడుకల లో డీసీపీ శ్రీనివాసరెడ్డి, సీఐ మల్లేష్‌యాదవ్ పూజలలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను, తాగునీటి సదుపాయాన్ని కల్పించారు.

48
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles