స్థానిక సమరానికి సై

Sun,April 14, 2019 02:30 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 13 : పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో స్థా నిక సంస్థల పోరుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోం ది. మే 28 వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ లోపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జూలై 4 నాటికి జిల్లా పరిషత్, 5వ తేదీ నాటికి మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉండగా, జిల్లాలో ఇప్పటికే 140 ఎంపీటీ సీ, 12 జెడ్పీటీసీ, 12 ఎంపీపీ స్థానాలు సహా జెడ్పీ చైర్మన్ పదవికి సైతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. షెడ్యూల్ వెలువడేలోగా స్థానిక ఎన్నికల కసరత్తు పూర్తిచేసే ప్రక్రియలో అధికార యంత్రాం గం నిమగ్నమైంది. అందులో భాగంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లపై జరిగే పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా శనివారం జిల్లా కేంద్రంలో రిటర్నింగ్ (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్వో) అధికారులకు, అన్ని మండల కేంద్రాల్లో ప్రిసైడింగ్ (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు) తొలి విడత శిక్షణ ఇచ్చారు. 2014 స్థానిక ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాతిపదికన జరిగితే 2019లో జరిగే ప్రాదేశిక ఎన్నికలు మాత్రం కొత్త మండలా లు, జిల్లాల పరిధిలో జరుగనున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాను మహబూబాబాద్, జనగామ, జ యశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అ ర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా విభజించారు. జిల్లాల పు నర్విభజన తర్వాత జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలను కొత్తగా ఏర్పడిన రెవెన్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ప్ర భుత్వం ఇది వరకే గెజిట్ జారీ చేసింది. గుండాల మండలం భువనగిరి యాదాద్రి జిల్లాలో విలీనం కావడంతో 12 మండలాలను పరిగణలోకి తీసుకొని స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

మూడు విడతలుగా ఎన్నికలు..
గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే జి ల్లా, మండల పరిషత్ సభ్యుల ఎన్నికలను మూ డు విడతలుగా బ్యాలెట్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 30న ప్రకటించిన గ్రామీణ ఓటరు తుది జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు. ప్రతీ జెడ్పీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, మూడు లేదా నాలుగు మండల పరిషత్ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించి, పరిశీలన ప్రక్రియ పూర్తిచేస్తా రు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల పర్యవేక్షణ కోసం జోనల్, సెక్టోరియల్ అధికారుల నియామకాన్ని కూడా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాం గం సన్నాహాలు చేస్తుంది. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనుండగా బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కోసం టెండర్లను పిలిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18న హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారితో క లెక్టర్లు, డీసీపీలు, ఎస్పీలతో పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసుకుంది.

కొత్త చట్టం తర్వాతే మున్సిపోల్స్..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలతో పా టే మున్సిపోల్స్ నిర్వహించాలని ప్రభుత్వం భా వించినా రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్‌శాఖలో సమూల మార్పులతో కొత్త చట్టం తేవాలని ము ఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తుండడంతో పుర ఎన్నికలు కొంత ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. అ యితే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా నిర్వాహణకు సిద్ధంగా ఉం డేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగం గా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పట్టణ శివా రు కాలనీల విలీనం పూర్తయింది. 2014 మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగితే అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను మాత్రం మే 14న వెల్లడించి అదేరోజు ఎన్ని క పత్రాలను అందించారు. జనగామ పురపాలకంలో ఏడు గ్రామపంచాయతీలు, ఒక శివారు గ్రామాన్ని విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రస్తుతం ఉన్న 28వార్డుల పరిధిలోని శివారు కాలనీల విలీనంను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు.

ప్రాదేశిక పోలింగ్‌పై అధికారులకు శిక్షణ..
ప్రాదేశిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పత్రాలతో జరిగే పోలిం గ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై శనివారం జనగామలోని జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఆర్‌డీవో రాంరెడ్డి ఆధ్వర్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా జనగామ మండల పరిధిలోని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు జనగామలోని గాయత్రి గార్డెన్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భం గా సిబ్బంది విధులు, బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో వారి పాత్రపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రాదేశిక ఎన్నికలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా సంక్షే మ అధికారిణి పద్మజ రమణ, ఏసీడీపీవో ప్రేమలత, జిల్లా నోడల్ అధికారి కేఆర్ లత, డీఆర్‌డీఏ ఏపీవో వసంత, ఎంపీడీవో హసీం పాల్గొన్నారు.

సోషల్‌మీడియాలో వైరల్..
వరంగల్ ఫ్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ శనివా రం విడుదలైనట్లు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. తొలి విడత నామినేషన్లకు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో విడత 26వ తేదీ నుంచి 28 వరకు, మూడో విడత ఈ నెల 30వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు, స్క్రూట్నీ ఈ నెల 25 వ తేదీ పస్ట్‌ఫేజ్, 29 తేదీన సెకండ్ ఫేజ్, మే 3 వతేదీ థర్డ్‌ఫేజ్, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28 మొదటి విడత, రెండో విడత మే 2, మూ డో విడతకు మే 6 వతేదీ చివరి గడువు. పోలింగ్ మొదటి విడత మే 6, రెండో విడత మే 10, మూడో విడత మే 14 వతేదీన నిర్వహించనున్నట్లు సోషల్‌మీడియాలో మారుమోగింది. దీంతో ఆశావహులు ఎన్నికల బరిలో దిగడానికి ఆసక్తితో ఉన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ ఉత్తర్వులు రాలేదని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల్లో అధికారిక షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి అయింది. ఎన్నికల అధికారుల నియామకం జరిగి, శిక్షణ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ఉంటుందనే సంకేతాలు రావడంతో మళ్లీ గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు జరిగి వారం రోజులు గడువక ముందే, మళ్లీ స్థానిక ఎంపీటీసీ, జె డ్పీటీసీ ఎన్నికల వస్తున్నాయో సంకేతాలు రావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైనది. అ యితే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. నిజానికి రాష్ట్ర ఎన్నికల సం ఘం దాదాపు ఇదే తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని డ్రాప్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టు, అదే వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, జిల్లా యంత్రాం గం కానీ దీనిని ఇంకా ధృవీకరించకపోవడం విశేషం. మొత్తంగా ఎన్నికలు ఎప్పుడైనా తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన ఏర్పాట్లలో తామున్నట్టు యంత్రాంగం స్పష్టం చేస్తున్నది.

67
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles