పాలకుర్తిలో 73.75 శాతం..

Fri,April 12, 2019 02:40 AM

పాలకుర్తి ఏప్రిల్ 11: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. దాదాపు అన్ని కేంద్రాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి ఊపందుకోగా, మధ్యాహ్నం వరకు ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. బమ్మెర, గూడూరు, ఈరవెన్నులో ప్రజలు బారులుదీరారు. ఆయా కేంద్రాల్లో ఓటర్లు గంటలపాటు క్యూలో నిల్చొని ఓటేశారు. ఉదయం 9 గంటలకు 15 శాతం నమోదు కాగా ,11 గంటలకు 26.16, మధ్యాహ్నం 1 గంటకు 46.21, 3 గంటలకు 55.23 శాతం నమోదైంది. 5 గంటలకు 71 శాతం నమోదైంది. నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మొత్తంగా 73.75 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని లక్ష్మీనారాయణపురంలో 57వ పోలింగ్ మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అధికారులు పూలు అందిస్తూ స్వాగతం పలికారు. అలంకరణ చూసి ఉత్సాహం చూపారు.

వృద్ధులు, వికలాంగుల కోసం వీల్‌చైర్లను ఏర్పాటు చేయడంతో వారు స్వేచ్ఛగా ఓటేశారు. పలు కేంద్రాల్లో చంటిబిడ్డల తల్లులు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. తొలిసారి ఓటేసిన యువకులు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం కాస్త మందకోడిగానే పోలింగ్ మొదలు కాగా తదనంతరం ఉపందుకొంది. పాలకుర్తిలోని 55వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించగా, అనంతరం ప్రశాంతంగా కొనసాగింది. మల్లంపల్లి 151వ పోలింగ్‌లో కేంద్రంలోనూ కాసేపు ఈవీఎం మొరాయించింది. మిగతా చోట్ల సాయంత్రం వరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగిందని పాలకుర్తి నియోజకవర్గ ఏఆర్వో మాలతి తెలిపారు. గూడూరు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి మహేందర్ సందర్శించారు. పాలకుర్తి సీఐ రమేశ్‌నాయక్ మండలంలోన అన్ని కేంద్రాల్లో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 400 మంది పోలీసులు, కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొన్నాయని సీఐ తెలిపారు.

67
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles