వార్.. వన్‌సైడే..

Fri,April 12, 2019 02:40 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తేతెలంగాణ/స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్/లింగాలఘనపురం : వరంగల్ పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు భారీ మెజారిటీ ఖాయయని, వార్‌వన్‌సైడేనన్న విషయం ఓటింగ్ సరళి తేటతెల్లం చేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్, లింగాలఘనపురం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం జరిగిన ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తరలివచి కారు గుర్తుకు ఓటు వేశారన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పసునూరి దయాకర్‌కు 60 వేల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించామన్నారు. నేడు ఆ మెజారిటీని అధిగమించి రికార్డును బద్దలుకొట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఇది కార్యకర్తల సమష్ఠి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేదిశగా సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రణాళికను సిద్ధం చేసుకున్నారన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రతిపక్షాల జాడ కన్పించలేదన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఇప్పటివరకు నియోజకవర్గంలో 62,943 మంది వృద్ధులకు ఆసరా పింఛన్లు అందించినట్లు తెలిపారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 70 వేల మంది రైతులకు పెట్టుబడి కింద రూ.171 కోట్లు అందించినట్లు తెలిపారు. ముదిరాజ్‌ల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లతో చేపపిల్లలతో పాటు వాహనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎంపీ అభ్యర్ధి గెలుపునకు దోహదపడుతాయన్నారు. అనంతరం లింగాలఘనపురంలో ఈనెల 4న ఏదునూరి శ్రీను అనే వ్యక్తి మృతిచెందగా ఆయన కుటుంబసభ్యులను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరామర్శించారు. ఘన్‌పూర్‌స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సీహెచ్ నరేందర్‌రెడ్డి, ఆకుల కుమార్, తోట వెంకన్న, పార్సి కమల్, మారపాక రవి, మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, సర్పంచ్ సురేశ్‌కుమార్, శ్రీతిరుమలనాథస్వామి దేవస్ధానం చైర్మన్ కుంభం కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, తోట సత్యం, ఎంపీటీసీలు గోనెల ఉపేందర్, ఎస్ దయాకర్, నాయకులు గన్ను నర్సింహులు, మాతంగి దేవయ్య, చింత భరత్, చింత శ్రీను, చెరిపల్లి రామల్లు, అన్నెపు ఐలయ్య, డాక్టర్ జగన్, డాక్టర్ కుమార్, గట్టు మనోహర్‌బాబు, సున్నం యాదగిరి, వేముల నర్సింగం, ఉపసర్పంచ్ నీల ఐలయ్య పాల్గొన్నారు. లింగాలఘనపురంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగేందర్, భాస్కర్‌రెడ్డి, వీరన్న, మల్లేశం, శ్యాంప్రసాద్, యాదయ్య, శ్రీనివాస్, యాదగిరి, రాజు, జనార్దన్, వెంకటేశ్, శ్రీనివాస్, రాజశేఖర్‌రెడ్డి, స్వామి, వెంకటేశ్, వెంకటేశ్, భాగ్యలక్ష్మి, ఊర్మిళ, ఎలీషా, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles