ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి

Fri,April 12, 2019 02:40 AM

నర్మెట, ఏప్రిల్ 11: మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు గద్దల కిశోర్, టీఆర్‌ఎస్ నాయకుడు రెడ్డబోయిన రాజు తదితరులు గురువారం జ్యోతిరావు ఫూలే 192వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాబు జగ్జ్జీవన్‌రావు యూత్ అధ్యక్షుడు ఏనుగుల రఘు, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు గడ్డం మహేశ్, వార్డు సభ్యుడు ఖాతా పవన్‌కల్యాణ్, కొంపెల్లి సురేష్, ఏనుగుల వెలంగిణి, ఉదయ్, ఇరిగి సుధాకర్, గాదెర ప్రభాకర్, ప్రభుదాస్, శ్రీధర్ పాల్గొన్నారు.

లింగాలఘనపురం: అణగారిన వర్గాల జీవితాల్లో అక్షరజ్యోతి వెలిగించిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే అని ఎస్సై సంతోషం రవీందర్, సర్పంచ్ విజయమనోహర్ అన్నారు. ఫూలే జయంతిని ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాగల్ల ఉపేందర్, చెన్నూరి మల్లేశం, గట్టగల్ల అనిల్, ప్రశాంత్, గవ్వల మల్లేశం, శేకర్, వేముల శ్రీనివాస్, ఉడుగుల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అణగారిన వర్గాల అక్షరజ్యోతి..
రఘునాథపల్లి: చీకట్లో ఉన్న అణగారిన వర్గాలను అక్షరజ్యోతులుగా చేసేందుకు అను నిత్యం పాటుపడిన మహానుభావుడు మహాత్మాజ్యోతిరావు ఫూలే అని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, సర్పంచ్ కొయ్యడ మల్లేశ్‌మాదిగ అన్నారు.
మండలంకేంద్రంలోని ఏఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు కొడిదేటి కుమార్, తాళ్లపల్లి కుమార్, మేడ స్వామి, కొమ్మగల్ల కృష్ణ, మచ్చ అబ్బయ్య, అరూరి శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, సోమనర్సయ్య, భాస్కర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బహుజనుల దళపతి ఫూలే
పాలకుర్తి : సమాజంలో నిరాదరణకు గురయ్యే దళిత బహుజన బీసీ, మైనారీ,్ట వర్గాల పక్షాన దళపతిగా జ్యోతిరావు ఫూలే నిలిచాడని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని మహత్మ జ్యోతిరావు ఫూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్ర మంలో మాసంపెల్లి నాగయ్య, సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, బహుజన కులాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి రాజు, సాంబయ్య, పులి గణేశ్, శివాజి, పరశురాములు, బండి కొండయ్య, క్రాంతి, వెంకటయ్య పాల్గొన్నారు.

గూడూరులో స్వేరోస్ ఆధ్వర్యంలో..
మండలంలోని గూడూరు గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే 192వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా స్వేరోస్ మండల అధ్యక్షుడు గుండె కుమార్ మాట్లాడారు. గుగ్గిళ ఎల్లయ్య, పూజరి రమాకాంత్ గౌడ్, గడ్డి సమ్మన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles