అధికారులు సమన్వయంతో పని చేయాలి

Thu,April 11, 2019 01:32 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ/స్టేషన్‌ఘన్‌ఫూర్ టౌన్ ఏప్రిల్ 10: అధికారులు సమన్వయంతో పని చేసి పార్లమెంట్ ఎన్నికలను విజయవంతం చేయాలని వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు వీణాప్రధాన్ సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమేశ్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ అధికారి సమర్థంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహించి, డేటాను పరిశీలించిన అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్ల నిర్వహణపై దృష్టి పెట్టలన్నారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రాన్ని పూర్తి ఆధీనంలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ నిబంధనలకనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అధికారులు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించేలా చూడాలని ఆర్డీవో రమేశ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాసరావు, శ్రీలత, రజినీ, వీరప్రకాశ్, తిరుమలాచారి, డీటీలు శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

జాగ్రత్తగా వ్యవహరించాలి : కలెక్టర్
కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల కమిషనింగ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. మండలకేంద్రంలో ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరాన్ని సందర్శించి అందుబాటులో మందులను తేవాలన్నారు. ప్రతీ ఓటింగ్ యంత్రాన్ని క్షుణంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తకుండా నిపుణులు ముందుగానే జాగ్రత్త పడాలన్నారు. పస్ట్ లెవల్ చెకింగ్‌తో ఓటింగ్ యంత్రాల పనీతీరు తెలుసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో రమేశ్ నుంచి నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles