టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

Thu,April 11, 2019 01:32 AM

దేవరుప్పుల : దేవరుప్పుల మండలంలో పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి దయాకర్‌రావు చేస్తున్న అభివృద్ధి చూసి ఆ పార్టీని వీడి ఇదివరకే టీఆర్‌ఎస్‌లో చేరగా బుధవారం జరిగిన భారీ చేరికలతో ఆ పార్టీకి చావుదెబ్బ పడినట్టయింది. మండల వ్యాప్తంగా 32 గ్రామపంచాయతీలు ఉండగా ముచ్చటగా ముగ్గురు సర్పంచ్‌లు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో వేళ్ల మీద లెక్క బెట్టే నాయకులే మిగలడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో గురువారం జరిగే పార్లమెంట్ ఎన్నికలు టీఆర్‌ఎస్ పక్షాన ఏకపక్షంగా ఉంటాయని తేలిపోతోంది.

భారీగా చేరికలు
దేవరుప్పుల మండలంలోనే పెద్ద గ్రామపంచాయతీ సర్పంచ్‌తో పాటు, కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వార్డుసభ్యులు, ధరావత్‌తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. చిన్నమడూరు నుంచి పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ అర్జున్, సర్పంచ్ వంగ పద్మ, వార్డుసభ్యులు పరీదుల కృష్ణమూర్తి, లక్ష్మీనర్సయ్య, బొరెల్లి రమేశ్, కాంగ్రెస్ యూత్ మండల నాయకులు గజ్జెల భాస్కర్, రాంచందర్, నారాయణ, నిరంజన్, రంజిత్, కృష్ణ, నవీన్, రాజు, హరీశ్, అశోక్, సంజీవ, ఆంజనేయులు, మల్లేశ్, మధు టీఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కామారెడ్డిగూడెం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఓడపల్లి కొమురయ్య, వార్డుసభ్యులు చింత ఎల్లమ్మ, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కొంగరి లక్ష్మీ, యాదగిరితో పాటు పలువురికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ధరావత్‌తండాలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ధరావత్ కీమానాయక్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దేవానాయక్, అమర్‌సింగ్, దేవ, భిక్షపతి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు విక్రంరెడ్డి, రవి, రవి, గేమానాయక్, రాంకోటి, తదదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా నిలుస్తా..
పాలకుర్తి : ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి అభ్యున్నతికి అండగా నిలుస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో దర్దేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రం, సోమయ్య, నిమ్మల అంజయ్య, బాబు, సోమనర్సయ్య, సముద్రాల అశోక్, ఇతర నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారితోపాటు మండలంలోని దుబ్బతండాకు చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ బానోత్ కిషన్, వార్డుసభ్యులు రవి, ఇతర నాయకులు హన్మకొండలోని మంత్రి నివాసంలో పార్టీలోకి చేరారు. కాగా వారందరికీ గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్‌లు యాకాంతరావు, ఇమ్మడి ప్రకాశ్, వైస్ ఎంపీపీ దామోదర్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ పస్నూరి నవీన్, కటారి పాపారావు, నోముల సతీష్, కడుదల కర్ణాకర్‌రెడ్డి, మంద సోమయ్య, రమేశ్‌నాయక్, పాల్గొన్నారు.

వధూవరులకు మంత్రి ఆశీర్వాదం
మండలంలోని తీగారం గ్రామంలో బెల్లి సోమయ్య యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు బుధవారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనవెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ దామోదర్, కటారి పాపారావు ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles