ఓట్ల పండుగకు పయనం..

Thu,April 11, 2019 01:31 AM

ఖిలావరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్ బుధవారం ప్రయాణికుల రద్దీతో కక్కిరిసిపోయింది. గురువారం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటు, అసెంబ్లీ (ఓట్ల పండుగ)ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు సొంత ఊళ్లకు బయలు దేరారు. వరంగల్‌లో స్థిరపడ్డ సీమాంధ్రులు తమ గ్రామాలకు వెళ్లారు. అలాగే వరంగల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు తదితరులు తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. దూర, తీర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో రైల్వేస్టేషన్ ప్రయాణికుల రద్దీతో సందడిగా మారింది. కాగా వరంగల్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ గంట, కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 40 నిమిషాలు, కృష్ణా ఎక్స్‌ప్రెస్ 2.17 గంటలు, గుంటూరు వెళ్లే ఇంటర్‌సిటీ గంట, ఎర్నాకులం రప్తిసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 6.13 గంటలు, ముంబాయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 1.09 గంటలు ఆలస్యంగా నడిచాయి. అలాగే మరి కొన్ని రైళ్లు స్వల్ప వ్యవధి ఆలస్యంగా నడిచినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వరంగల్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు. ఎలాటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles