పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు

Wed,April 10, 2019 01:51 AM

జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 09 : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించామని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారి పద్మజ రమణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే జిల్లా వ్యాప్తగా దివ్యాంగుల ఓటరు నమోదు వంటి అంశాలపై పలు కార్యక్రమాలు చేట్టి ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు. మార్చి 3 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదులో జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి 1,320మంది దివ్యాంగులను కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించామన్నారు. జిల్లాలో కంటిలోపం ఉన్న 2,260మంది, వినికిడి సమస్య ఉన్న 1,975మంది, శారీరక వైకల్యం ఉన్న 8,806 మంది దివ్యాంగులను ఎన్నికల్లో ఓటుహక్కు, యంత్రాలు, వీవీప్యాట్‌ల వినియోగంపై చైతన్యం చేశామని ఆమె తెలిపారు. వందశాతం మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో 556 వాహనాలు సమకూర్చామని, వీరికోసం 857మంది వలంటీర్లను నియమించి 1200 టీషర్టులను అందించామన్నారు. అంధులైన దివ్యాంగుల ఓటర్లకు ముద్రితమైన 1756 ఎపిక్‌కార్డులను అందించామని పద్మజ రమణ వెల్లడించారు.

72
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles