నకిలీ ఆర్టీఏ, పోలీస్ ముఠా అరెస్ట్


Wed,April 10, 2019 01:51 AM

జనగామ టౌన్, ఏప్రిల్ 09: ఆర్టీ ఏ, పోలీసు అధికారులమంటూ జాతీ య రహదారులపై రాత్రి సమయం లో వాహనదారుల నుంచి అక్రమం గా వసూళ్లకు పాల్పడుతున్న ఓ ము ఠాను జనగామ పోలీసులు పట్టుకున్నారు. జనగామ సీఐ మల్లేశ్ యాదవ్ కథనం ప్రకారం.. రఘునాథపల్లి మం డలం నిడిగొం డ గ్రామానికి చెందిన కే ప్రశాంత్, ఓ రమేశ్, వీ బాలకృష్ణ, వీ వేణు, సీ కరుణాకర్, బీ రాజశేఖర్, టీ జోసఫ్ ముఠాగా ఏర్పడి ఆర్టీఏ, పో లీస్ అధికారులమని చెబుతూ జాతీ య రహదారులపై లారీలు, ట్రా క్టర్ల ఓనర్లు, డ్రైవర్లను బెదిరిస్తూ అక్రమం గా వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాజాగా ముఠా సభ్యులు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైనున్న జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామ శివారులో లారీలను ఆ పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రు. దీంతో ఇసుక లారీల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ట్రా ఫిక్‌లో ఇరుక్కున్న శ్రీనివాస్ అనే ఓ లారీ డ్రైవర్ శ్రీనివాస్ రోడ్డుపై వాహనాలను నిలుపుతున్న యువకులు మ ద్యం సేవించి ఉండడాన్ని గమనించా డు.


వెంటనే 100కు డయల్ చేసి పో లీసులకు సమాచారం ఇచ్చాడు. వెం టనే స్పందించిన జనగామ పోలీసులు రఘునాథపల్లి పోలీసులను అప్రమత్తం చేసి, జనగామ నుంచి ఇంటర్‌సెప్టర్, పెట్రోలింగ్ వాహనం ద్వారా ఘటనా స్థలికి చేరుకున్నారు. రఘు నాథపల్లి, జనగామ పోలీసులు మూ కుమ్మడిగా దాడి చేసి ముఠాలోని కే ప్ర శాంత్, ఓ రమేశ్, వీ బాలకృష్ణను పట్టుకున్నారు. వారి నుంచి కారుతోపాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.4900 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారించగా సోమవారం లింగాలఘనపురం మండలం గుమ్మడవెళ్లి గ్రామంలో ఓ శుభాకార్యానికి వెళ్లి వ స్తున్న క్రమంలో మార్గమధ్యలో నెల్లుటలోని మద్యం దుకాణంలో బాటిల్ కొని తాగామని, సరిపోకపోవడంతో యశ్వంతపూర్‌లో ఆర్టీఏ, పోలీసు అ ధికారులమంటూ వసూళ్ల పాల్పడుతుండగా అడ్డంగా దొరికి పోయినట్లు సీఐ తెలిపారు. కాగా మిగిలిన నలుగు రు పరారీలో ఉన్నారని, వారిని పట్టు కునేందుకు మంగళవారం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామ న్నారు. కాగా జనగామ ఎస్సై రవికుమార్, రాజేశ్‌నాయక్ సరైన సమయంలో స్పందించి ముఠాను పట్టుకున్నందు కు సిబ్బందిని సీపీ డాక్టర్ ర వీందర్, డీసీపీ శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

83

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles