కారు.. ప్రచార హోరు


Tue,April 9, 2019 03:02 AM

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో స్పీడ్ పెంచారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నా రు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు వివరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని వేడుకుంటున్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలతో వీధులను హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు బ్ర హ్మరథం పడుతూ కారు గుర్తుకే ఓటేస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. పలుచోట్ల మహిళలు పెద్దసంఖ్యలో కోలాటాలు ఆడుతూ, పూలు చల్లుతూ, బతుకమ్మలు, బోనాల తో ఘనస్వాగతం పలుకుతున్నారు. దీంతో పల్లెలు, ఊర్ల న్నీ గులాబీ జాతరను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీశ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో అభ్యర్థుల గెలుపు కో సం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా ఆయా గ్రామాలు, పల్లెల్లో ప్రచారం చేస్తున్నా రు. ప్రజల నుంచి స్పందనకు అభ్యర్థుల గెలుపు ఖాయమైందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.


గ్రామాల్లో ప్రచారహోరు..
టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. జనగా మ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లోని ప్రతీ గడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారు. వరంగల్ ఎం పీ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోరుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తన నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో జోరుగా ప్రచా రం నిర్వహించారు. మధ్యాహ్నం దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం నుంచి రోడ్‌షో నిర్వహించిన మంత్రికి స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికా రు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓపెన్ టాప్ జీపులో ఉన్న మంత్రిపై పూలవర్షం కురిపిస్తూ, మహిళలు కోలాటాలు ఆడుతూ అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం రఘునాథపల్లి మండలంలోని బాంజీపేటలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ప్రచారం చేశారు. సాయంత్రం పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి దయాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని నియోజవర్గాల్లో కల్లా పాలకుర్తిని మెజార్టీలో నెంబర్‌వన్‌గా నిలపాలని కోరారు. రోడ్‌షోలో మంత్రితో పాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాలకుర్తి, కొడకొండ్లలో దయాకర్ గెలుపు కోరుతూ టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎంపీ అభ్యర్థి దయాకర్ గెలుపు కో రుతూ ప్రచారం నిర్వహించారు. రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి, గోవర్థనగిరి, బాంజీపేట గ్రామాల్లో ప్రచా రం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి బాం జీపేటలో ప్రచారం నిర్వహించారు. లింగాలఘనపురం, జ ఫర్‌గఢ్, చిల్పూర్ మండలాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు ఇం టింటి ప్రచారం నిర్వహించారు. జనగామ నియోజకవర్గం లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భువనగిరి ఎంపీ అ భ్యర్థి బూర నర్సయ్యగౌడ్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. జనగామ పట్ణణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ స భ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సయ్యగౌడ్‌ను అత్యధిక మె జార్టీతో గెలిపించాలని కోరారు. భవిష్యత్‌లో వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పట్టణంలోని పలువార్డుల్లో టీఆర్‌ఎస్ పార్టీశ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. నర్మెటలో ముదిరాజ్‌లు బూర నర్సయ్యగౌడ్‌కు తమ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

నేటితో ప్రచారానికి తెర
నేటితో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఈ మేరకు అన్ని పార్టీల అభ్యర్థులు చివరిరోజు గడువులోగా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పార్టీశ్రేణులు ఆయా గ్రామాలు, మండలాలు, ని యోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు రాజకీయ నాయకుల రాకపోకలతో సందడిగా మారాయి. రచ్చబండ వేదికగా అభ్యర్థుల గెలుపు ఓటములు జోరుగా చర్చలు కొనసాగాయి. నేటితో ప్రచారానికి తెరపడనుండడంతో పల్లెల్లో ఒక్కసారిగా బోసిపోనున్నాయి.

కుమారస్వామికి ఉగాది పురస్కారం
జఫర్‌ఘడ్: కళా నిలయం స్వచ్ఛంద సేవా సం స్థ గోదావరిఖని ఆధ్వర్యంలో అందిస్తున్న 2019 ఉగాది పురస్కారానికి మండలంలోని రఘునా థ పల్లికి చెందిన చల్ల కుమారస్వామి ఎంపికయ్యా రు. సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో గత కొ న్నేళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి తనను ఎంపిక చేసినట్లు కుమారస్వామి తెలిపారు. సంస్థ ఆధ్వ ర్యంలో గోదావరిఖనిలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చందర్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివ కుమా ర్, చంద్రమౌలీశ్వర స్వామి, సంస్థ అధ్యక్షుడు సన త్ కుమార్ తనకు పురస్కారం అందజేశారని కుమారస్వామి తెలిపారు.

123

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles