పోలింగ్ కేంద్రాలు 805

Tue,April 9, 2019 03:00 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 08 : జెడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. డీఆర్‌డీ వో, జిల్లా లైజనింగ్ అధికారి రాంరెడ్డి ఆదేశాలతో గ్రామాల వా రీగా పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ డ్రాఫ్ట్ ప్రతులను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై ప్రజలకు అందుబాటులో ఉం చారు. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెం బ్లీ నియోజకవర్గాల పరిధిలో 805 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నారు. ఈనెల 15 వరకు పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. 17న వాటిని పరిశీలించి, 18న పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తిచేసి 20న కలెక్టర్ ఆదేశా లతో తుది నివేదికను వెల్లడించనున్నారు. జనగామ మండలం లో 65, బచ్చన్నపేట మండలంలో 81, తరిగొప్పులలో 31, నర్మెటలో 41, లింగాలఘనపురంలో 64, చిలుపూరులో 62, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 86, రఘునాథపల్లిలో 85, జఫర్‌గడ్‌లో 62, పాలకుర్తిలో 99, దేవరుప్పులలో 68, కొడకండ్లలో 61 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ), మండల పరిషత్ (ఎంపీటీసీ) ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై తుది ఓటరు జాబితాలను వెల్లడించారు. జిల్లాలోని గుండాల మి నహా 12 మండలాల్లో మొత్తం 3,84,168 మంది ఓటర్లు ఉం డగా వారిలో పురుషులు 1,92,593 మంది, స్త్రీలు 1,91,566 మంది స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియో గించుకోనున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles