సీపీఎస్ రద్దుపై ఐక్య ఉద్యమం

Tue,April 9, 2019 02:59 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 08 : ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ కు గొడ్డలి పెట్టుగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానం రద్దుకు అన్ని సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తానని వరంగల్, ఖమ్మం, న ల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం జనగామలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే రంజిత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవం ధ్యేయంగా ప్రశ్నించే గొంతుకే లక్ష్యంగా ప్రజాపక్షంగా నిలబడుతానని అన్నారు. 2019-20 విద్యాసంవత్స రం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఖాళీగా ఉన్న 1500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయించడం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేసేందుకు ప్రభుతాన్ని ఒప్పిస్తానని చెప్పారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పీ చంద్రశేఖర్‌రావు, మరియజత్రుత, జీ శ్రీనివాస్, జయప్రకాశ్, టీపీటీఎఫ్ జిల్లా బాధ్యులు డీ శ్రీనివాస్, బీ లక్ష్మయ్య, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీ శ్రీనివాస్, భాస్కర్, గణేశ్, సీపీఎస్ ఉద్యోగుల నాయకులు లింగమూర్తి, కల్పనాదేవి, వీరన్న, వాసు, కిషన్, ముత్తయ్య, మల్లు, భాస్కర్, వెంకట్, శ్రీనాథ్, వేణుమాధవ్ తదతరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles