గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా

Thu,March 21, 2019 01:31 AM

తొర్రూరు రూరల్, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం పని చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగు తున్నాయని చెప్పారు. గ్రామాల్లో కాంగ్రెస్ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మండలంలోని వెలికట్ట, గుడిబండ తండా, నాంచారిమడూర్ గ్రామాల కాంగ్రెస్ సర్పంచులు పోసాని పుష్పలీల, లకావత్ శోభన, గుంటుక యాదలక్షి, మాజీ ఎంపీటీసీ, ఉప సర్పంచ్ దీకొండ సంధ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు కోమళ్ల లింగారావు, పోసాని రాములు, సుమన్, బోగ భాస్కర్, రాములు, ఐలయ్య, బందు వెంకన్న, దేవమ్మ, సుధాకర్, వైకుంఠంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని మంత్రి స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలంత సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇం టింటికీ తాగునీరు అందిస్తున్నామని, ఆరు నెలల్లో ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా చెరువుల్లోకి నీరు తెచ్చి సాగు, తాగునీరుకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపబోతుందని చెప్పారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాల ని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకునే బాధ్యత సర్పంచ్, ప్రజలపై ఉందన్నారు. రెండు పార్లమెంట్ సీట్లను భారీ మెజార్టీ తో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, మంత్రి దయాకర్‌రావు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాననే నమ్మకం తో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు సర్పంచులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నె సోమయ్య, మండల అభివవృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్‌రావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పసుమర్తి సీతారాములు, శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నకిరకంటి కొమురయ్య, సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, లింగాల వెంకటనారాయణగౌడ్, రామసహాయం కిశోర్‌రెడ్డి, గుడిపూడి మధుకర్‌రావు, వైస్ ఎంపీపీ ఈనపల్లి శ్రీనివాస్, ధరావత్ రాజేశ్‌నాయక్, ప్రవీణ్‌రాజు, దొంగరి శంకర్, కుర్ర శ్రీనివాస్, బిజ్జాల అనిల్, బత్తుల యాకయ్య, ఎన్నమనేని శ్రీనివాసరావు, జైసింగ్, వెంకన్న, ముద్దసాని సురేశ్, ఉపేందర్, శ్యాంసుందర్‌రెడ్డి, ఇమ్మడి రమణ, సోమ్లా, దీకొండ ఎల్లయ్య, కుమార్, వీరారెడ్డి, రమేశ్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles