నర్మెట జీపీకి రూ. 8.90 లక్షల ఆదాయం

Wed,March 20, 2019 01:39 AM

-పశువుల అంగడి రహదారి, తైబజార్, పగ్గాలకు వేలం
-సర్పంచ్ అధ్యక్షతన పాటలు నిర్వహించిన ఈవోపీఆర్డీ
-పోటీ పడి టెండర్లు దక్కించుకున్న పలువురు కాంట్రాక్టర్లు
నర్మెట, మార్చి 19: స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పశువుల అంగడి రహదారి, తైబజార్, పగ్గాలకు వేలం పాటలు నిర్వహించారు. ఈ మేరకు 8,90,500 ఆదాయం సమకూరింది. ఈవోపీఆర్డీ జీ లత సమక్షంలో సర్పంచ్ ఆమెడపు కమలాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గోపగోని శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి సదానందం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంట్రాక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. పశువుల రహదారి సంతకు నర్మెటకు చెందిన కన్నెబోయిన రామృకృష్ణ సీల్డ్ కవర్‌లో టెండర్ వేశారు. ఈ మేరకు రామకృష్ణ రూ. 7.80 లక్షలకు పశువుల అంగడి రహదారి టెండర్ దక్కించుకున్నారు. అదేవిధంగా తైబజార్‌ను నర్మెటకు చెందిన బైరోజు శ్రీధర్ బహిరంగ వేలం పాట పాడి రూ. 1,02,500లకు దక్కించుకున్నారు. పగ్గాల వేలాన్ని కొట్టె సదానందం రూ. 8 వేలకు పొందారు. కాగా, పశువుల అంగడి రహదారి పాటకు నలుగురు కాంట్రాక్టర్లు పోటీ పడగా.. అత్యధికంగా రూ. 7.80 లక్షలకు పాట పాడి కన్నెబోయిన రామకృష్ణ సొంతం చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి అంగడి వేలం పాట తక్కువ వచ్చిందని ఈవోపీఆర్డీ లత తెలిపారు. వేలం పాటలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు విడతల వారీగా గ్రామ పంచాయతీకి డీడీలు కట్టి సంతను నడిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంట్రాక్టర్లు బైరోజు ఉపేందర్, సతీశ్, చెవుల రాజు, కొన్నె అంజయ్య, రమేశ్, కారోబార్ సిర్ర వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles