సఖీ సేవలను వినియోగించుకోవాలి

Wed,March 20, 2019 01:39 AM

కొడకండ్ల : ప్రభుత్వం మహిళ సంరక్షణ కోసం ప్రత్యకంగా అమలు చేస్తున్న సఖీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడకండ్ల సీడీపీవో జయంతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన పోషణ్ అభియమాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సఖీ కార్యక్రమంను తొలుత జనగామజిల్లాను ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారన్నారు. మహిళలకు జరగుతున్న ప్రతీ అన్యాయాన్ని సఖీ పోగ్రాం అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రాలలో సఖీ సేవలను అందజేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని రామవరంలో ఉపాదీ హామీ కూళీలకు సఖీ, పోషణ్ అభియాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సఖీ ప్రోగ్రామ్ సిబ్బంది బీ రజిని, స్వామి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు మల్లేశ్వరీ, ఝాన్సీరాణి, అంగన్‌వాడీ టీచర్లు , ఉపాధిహమీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎడెల్లి మహేందర్ పాల్గొన్నారు. కాగా రైతులు పోషకాహార పంటలను పండిస్తూ వారు తినక పోషకాహార లోపంతో జీవిస్తున్నారని కొడకండ్ల ఐసీడీఎస్ అంగన్‌వాడీ టీచర్ల సంఘం అధ్యక్షురాలు గోనె సునీతారెడ్డి అన్నారు. పెద్దబాయితండాలో ప్రభుత్వం చేపట్టిన పోషణ అభియాన్ పక్షోత్సవంలో భాగంగా నిర్వహించిన రైతు క్లబ్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్ రజిత, రైతులు రాంజీ, చంద్రూ,రవి, బీమ్లా, శంకర్, మహళ రైతులు జమ్మి, కమ్లీ, కిషాని పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles