కౌంటింగ్ కేంద్రాల పరిశీలనపై సమీక్ష

Wed,March 20, 2019 01:38 AM

జనగామ రూరల్, మార్చి19: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాజారావు, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ రవీందర్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో మాట్లాడుతూ జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ బాక్స్‌లను భద్రపరిచి కౌంటింగ్ కోసం అనువైన కేంద్రాలను పరిశీలన చేస్తున్నామన్నారు. మండలంలోని పెంబర్తి విద్యాభారతి ఇంజినీరింగ్ కశాశాల, యశ్వంతాపూర్‌లోని క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల, జిల్లా కేంద్రాంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కశాశాలలను పరిశీలించామన్నారు. ఈ మూడు కేంద్రాల్లో కౌంటింగ్‌కు అన్ని సౌకర్యాలున్నాయన్నారు. ఇందులో దాదాపు పెంబర్తిలోని ఇంజినీరింగ్ కళాశాల అయితేనే బాగుంటుందని సూత్రప్రాయంగా ఆలోచన చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీ, హాసీం, ఈవోపీఆర్డీ శివకుమార్, పీఆర్‌ఏఈ శ్రీనివాస్, బాబురావు, పంచాయతీ కార్యదర్శులు ఇఫ్తికారుద్దీన్, వహీద్, సాంబయ్య, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles