ముగిసిన బుగులు వెంకన్న బ్రహ్మోత్సవాలు

Wed,March 20, 2019 01:36 AM

స్టేషన్ ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : చిలుపూరు మండలకేంద్రంలోని శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉత్సవమూర్తులకు చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అర్చకుడు వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, పద్మావతి, గోదాదేవిని పూలమాలలతో అలంకరించారు. అనంతరం పుష్పయాగం, తిరువీధిసేవ, ఏకాంతసేవ, ద్వాదశారాధన, ధ్వజారోహణ, కంకణోద్వాసన, మహదాశ్వీరాచనం, సప్తవర్ణాలు, పండిత సన్మానం నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులకు చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, మాజీ దేవస్థాన చైర్మన్ నాగరాజు, మాజీ ధర్మకర్తలు దామోదర్, నర్సింహులు, శ్రీధర్, చేరాలు, వెంకటేశ్వర్లు, అర్చకులు శ్రావణకుమారచార్యులు, రవీందర్ శర్మ, రంగాచార్యులు, లలితాప్రసాద్‌శర్మ, సిబ్బంది రమేష్, వీరన్న, కృష్ణ, మహేష్, మల్లికార్జున్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles