నాణ్యమైన పాలనే సేకరించాలి

Tue,March 19, 2019 02:03 AM

జనగామ నమస్తేతెలంగాణ. మార్చి 18 : పాల నా ణ్యత విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని. నాణ్యమైన పాలనే డెయిరీకీ తీసుకురావాలని తెలంగాణ రా ష్ట్ర పాడిపరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జనగామలోని విజయపాల డెయిరీని ఆయన సందర్శించి ల్యాబొరేటరీ, స్టోర్స్, బా యిలర్స్ తదితర సెక్షన్లను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ జనగామ డెయిరీ పరిధిలోని గ్రామా ల్లో పాల సేకరణ పకడ్బందీగగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాల విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, నాణ్యమైన పాలను మాత్రమే సేకరించాలని ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే జనగామ రై తులు నాణ్యమైన పాలు తీసుకువస్తున్నారనే పేరుంద ని, దానిని అదే విధంగా కొనసాగించాలన్నారు. రైతులకు రావాల్సిన నగదు ప్రోత్సాహకాలు ఈ నెలాఖరు లోగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అ న్నారు.అంతే కాకుండా జనగామకు ప్యాకింగ్ మిషన్ మంజూరుకు ప్రత్యేక కృషి చేస్తానని అన్నారు. ప్రస్తుతమున్న సమావేశ మందిరం పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఫంక్షన్‌హాల్‌గా మార్చి అదనపు ఆదా యం వచ్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని అన్నారు. అనంతరం పాలు తీసుకొనే విధానం, వెన్న తదితర పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మల్లికార్జున్‌రావు, ప్రవీణ్‌కుమార్, అకౌం ట్ అధికారులు లావణ్య, భవాని, క్వాలిటీ కంట్రోలర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా డెయిరీ అధికారి గోపాల్‌సింగ్, జిల్లా డెయిరీ అధ్యక్షులు జనగామ సోమిరెడ్డి, రైతులు చంద్రమౌళి, ఉపేందర్‌రెడ్డి, సిబ్బంది వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, వంశీకృష్ణ, యాదగిరి, హనుమంతు, నాగరాజు, విజయ్, ఆంజనేయులు, విజయ్ పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles